ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం తో ఈ సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఈ సమావేశాలకు మాజీ సీఎం జగన్ సహా వైసీపీ సభ్యులు హాజ రయ్యారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన తరువాత పోడియం వద్దకు వచ్చిన వైసీపీ సభ్యులు ప్రతిపక్ష హోదా పై నినాదాలు చేసారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ స్లోగన్స్ ఇచ్చారు. ఆ తరువాత కాసేపటికే జగన్ తో సహా వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేసారు.
వైసీపీ సభ్యుల నిరసన
సభలో జగన్ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ లక్ష్యాను వివరించారు. గత ప్రభుత్వంలో వైఫల్యాల గురించి ప్రస్తావన చేసారు. సభ ప్రారంభం సమయానికి తన పార్టీ ఎమ్మెల్సీలు – ఎమ్మె ల్యేలతో కలిసి సభా ప్రాంగణానికి జగన్ చేరుకున్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన కొద్ది సేపటికే సభలో వైసీపీ సభ్యుల నిరసన మొదలైంది. పోడియం వద్దకు వచ్చి ప్రతిపక్ష హోదా కల్పించాలి.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అంటూ సభ్యులు నినాదాలు చేసారు. వైసీపీ సభ్యుల నిరసన మధ్యనే గవర్నర్ తన ప్రసంగం కొనసాగించారు.

వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్
వైసీపీ వాకౌట్ సభ్యులు నిరసన చేస్తున్న సమయంలో జగన్, బొత్సా తమ సీట్ల వద్ద నిలబడి మద్దతు ఇచ్చారు. కొద్ది సేపటి నుంచి జగన్ తో సహా వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేసారు. సభ జరుగుతున్న సమయంలో జగన్ తన పార్టీ సభ్యులతో కలిసి సభలో కూర్చోవటం.. వాకౌట్ నిర్ణయం ముందు బొత్సాకు చేస్తున్న సూచనల వీడియో వైరల్ అవుతోంది. ఈ రోజు గవర్నర్ ప్రసంగం తరువాత సభ వాయిదా పడనుంది. వెంటనే బీఏసీ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి.. ఏ అంశాల పైన చర్చించాలనే విషయం పైన నిర్ణయం తీసుకోనున్నారు.
మూడు వారాల పాటు సభ
దాదాపు మూడు వారాల పాటు సభ నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
28న బడ్జెట్ రేపు (మంగళవారం) గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం పై చర్చ జరగనుంది. సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. ఆ తరువాత రెండు రోజులు సభ వాయిడా పడనుంది. తిరిగి 28న సభలో ప్రభుత్వం 202-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. బడ్జెట్ కు వైసీపీ సభ్యులు హాజరవుతారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. జగన్ రేపటి నుంచి రెండు రోజులు పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక, జగన్ ఈ సమావేశాలకు వస్తారా లేదా అనేది పార్టీ నేతలకు స్పష్టత లేదు. బడ్జెట్ వేళ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.