నగరిలో రోజా కి షాక్ ఇవ్వబోతున్న జగన్. వైసీపీలో ఏదో జరుగుతోంది ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు ఆ పార్టీని వీడగా ఇప్పుడు స్వయంగా ఆ పార్టీ అధినేతే కొందరికి చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పుడిదే అంశంపై ఏపీ పాలిటిక్స్‌లో ముఖ్యంగా వైసీపీలో హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది ఇంతకీ జగన్ రెడ్డి పార్టీలో ఏం జరుగుతోంది. ఎవరిని పంపించేందుకు పొగ పెడుతున్నారు. ఎవరి రాక కోసం ఎవరిని బలి చేసే ప్రయత్నం జరుగుతోంది.

జగన్ తీసుకున్న నిర్ణయానికి రాజకీయ సంబంధం:
వైసీపీ అధినేతే స్వయంగా కొందరిని పంపించే ప్రయత్నాలు చేస్తున్నారట. మాజీ మంత్రి రోజాను పార్టీ నుంచే సాగనంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. రోజా సేవలు ఇక చాలని బలమైన నాయకుడు అవసరమని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారట.
ప్రజల అభిప్రాయం: జగన్ నిర్ణయంపై జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న పార్టీ నేతలు ఇవేం పనులు అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట.
రాజకీయ ప్రాముఖ్యతలో నిస్సందేహమైన పాత్ర:రోజా
రాజకీయాలలో రోజా యొక్క ప్రాముఖ్యతను అంగీకరించకుండా జగన్ ఎలా దూరం పెట్టగలరు? ఆమె వైసీపీ కోసం చేసిన పనులు.
రాజకీయం లో మార్పులు:ఇందులో భాగంగానే గాలి ముద్దు కృష్ణమ నాయుడు రెండో కుమారుడిని వైసీపీలోకి చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు జగన్. యువ నాయకుడు గాలి జగదీష్ బుధవారం నాడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరే అవకాశం ఉందంటున్నారు.
పార్టీ కోసం కృషి చేసిన రోజా :
వాస్తవానికి జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు రోజా వైసీపీ కోసం చాలా ఫైట్ చేశారు. ఆయన ప్రత్యర్థులు చేసిన కామెంట్స్, విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు. ప్రత్యర్థులపై తనదైన శైలిలో ఫైర్ అవుతూ ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందారు. మరి అలాంటి నాయకురాలిని జగన్ దూరం పెట్టాలని భావిస్తున్నట్లు వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. మరి నిజంగానే రోజాను పక్కనపెట్టే ఉద్దేశ్యంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఎలాగైనా నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందాలి అన్న ఆకాంక్షతో ఉన్న గాలి జగదీష్ ప్రకాష్ ఈనెల 12వ తేదీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారని తెలుస్తుంది. అదే జరిగితే నగరి వైఎస్సార్ సీపీలో లెక్కలు మారే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్‌పై గాలి జగదీష్ ప్రకాశ్‌కు వైఎస్ జగన్ హామీ ఇస్తే కనుక రోజా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. మరి నగరి విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.