పోసాని అరెస్టుపై జగన్ స్పందన

పోసాని అరెస్టుపై జగన్ స్పందన

వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఆయన పై పలు కేసులు నమోదయ్యాయి. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్, ఇతర నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పోసానిపై తాజాగా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోలీసులు నిన్న హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి అరెస్ట్ చేసి తరలించారు. నేడు కోర్టులో హాజరుపర్చిన అనంతరం రిమాండ్‌కు పంపే అవకాశం ఉంది.

Advertisements

జగన్ స్పందన

జగన్ పోసాని కుటుంబానికి మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. “దేవుడు అన్నీ చూస్తున్నాడు. మీరు ధైర్యంగా ఉండండి. మేమంతా మీకు తోడుగా ఉంటాం” అని భరోసా ఇచ్చారు. ఈ కేసులో పోసానికి న్యాయపరమైన సహాయం అందించేందుకు ఇప్పటికే వైసీపీ న్యాయవాదుల బృందాన్ని నియమించామని, రాబోయే రోజుల్లో పోసానిపై పెట్టిన కేసులను చట్టపరంగా ఎదుర్కొనేందుకు పూర్తి మద్దతుగా ఉంటామని చెప్పారు.ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులకు ఈ వ్యవహారాన్ని అప్పగించామని జగన్ ఆమెకు తెలిపారు. ఆలోపు మనోధైర్యంతో ఉండాలని ఆమెకు సూచించారు.

ys jagan posani krishna murali 394 1740635432

పోసాని అరెస్టును వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది కక్ష సాధింపు చర్య అని ఆరోపించారు. “గత ప్రభుత్వం సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై ఎవరు విమర్శలు చేసినా వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వైసీపీకి అనుకూలంగా మాట్లాడిన వారిపై ఊహించని వేధింపులు మొదలయ్యాయి” అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.మరోవైపు పోసాని అరెస్టుపై జగన్ వైసీపీలో సీనియర్ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. టీడీపీలో జీవీ రెడ్డి ఎపిసోడ్ తర్వాత చోటు చేసుకున్న ఈ అరెస్టు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని వారితో జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇవాళ అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్ కు తీసుకువచ్చి పోసాానిని ప్రాథమికంగా విచారించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు సిద్దమవుతున్న నేపథ్యంలో వైసీపీ లాయర్లు అక్కడికి బయలుదేరినట్లు తెలుస్తోంది.

కేసు వివరాలు

జనసేన నేత జోగిమణి ఫిర్యాదు మేరకు ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో పోసాని కృష్ణమురళిపై 196, 353 (2), రెడ్ విత్ 3 (5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలోనే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి, అనంతరం అన్నమయ్య జిల్లాకు తరలించారు.

పోసాని అరెస్ట్‌తో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఒకవైపు కూటమి ప్రభుత్వం న్యాయపరంగా అన్ని కోణాల్లో కేసులను పరిశీలిస్తుందని చెబుతుండగా, మరోవైపు వైసీపీ ఈ చర్యలను తీవ్రంగా తప్పుబడుతోంది. పోసాని వ్యవహారం ఏపీలో మళ్లీ కొత్త రాజకీయ వివాదానికి తెరతీసేలా కనిపిస్తోంది.

Related Posts
ఎకో పార్కులో ఫ్రీగా వాకింగ్ చేయొచ్చు నారా లోకేశ్
ఎకో పార్కులో ఫ్రీగా వాకింగ్ చేయొచ్చు నారా లోకేశ్

ప్రవేశ రుసుం తొలగింపు - వాకర్స్ మిత్రులకు నారా లోకేశ్ ఇచ్చిన హామీ మంగళగిరి వాసులకు ముఖ్యమంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. ఎకో పార్కులో ఉదయం Read more

వల్లభనేని వంశీ పిటిషన్‌పై విచారణ వాయిదా
Adjournment of hearing on Vallabhaneni Vamsi petition

వంశీతో పాటు మరో ఇద్దరు నిందితులను కస్టడీకి అమరావతి: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్‌ విచారణను విజయవాడ కోర్టు రేపటికి వాయిదా వేసింది. Read more

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు – వంశీ అనుచరులు అరెస్ట్
Gannavaram TDP office attack case

విజయవాడ: గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఈ కేసులో నిందితులుగా గుర్తించిన 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. Read more

చంద్రబాబు పాలన బాగుంది: ఎంపీ కృష్ణయ్య
r.krishnaiah

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనా బాగుందని బీజేపీ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. చంద్రబాబు పాలన బాగుందని..మంచి పరిపాలన దక్షుడని.. విజనరీ ఉన్న నేతని… Read more