విష్వక్‌సేన్.. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న యువ కథానాయకుడు. ‘ఫలక్ నామా దాస్’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘పాగల్’ వంటి చిత్రాలతో తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే సాధారణంగా ఈ యంగ్ హీరో సినిమా విడుదల ముందు ఏదో ఒక వివాదం, ఆ సినిమా గురించి ఏదో ఒక హాట్ టాపిక్ జరుగుతుంటుంది. కొన్నిసార్లు ప్రీ రిలీజ్ వేడుకలో కాస్త వివాదాస్పదంగా మాట్లాడటం, అది వైరల్ కావడం ఏదో ఒక రకంగా విష్వక్ సినిమా విడుదల ముందు వార్తల్లో నిలుస్తుంది.

ఆవేదన వ్యక్తం చేసిన విష్వక్‌సేన్
పృథ్వీరాజ్ కామెంట్స్ జరిగిన డ్యామేజ్‌ను కంట్రోల్ చేయడానికి హీరో విష్వక్‌సేన్, నిర్మాత సాహు గారపాటి కలిసి ప్రెస్‌మీట్ పెట్టి క్షమాపణలు తెలియజేశారు. తమకు తెలియకుండానే ఇలా జరిగిందని, దయచేసి ఎంతో కష్టపడి తీసిన సినిమాను బాయ్‌కాట్ చేయడం సమంజసం కాదని, ఒక్కరు చేసిన తప్పుకు సినిమా టీమ్ అందరినీ శిక్షించకూడదని తమ ఆవేదన తెలియజేశారు. అయితే ఈ ప్రెస్‌మీట్‌కు పృథ్వీరాజ్‌ను కూడా తీసుకొచ్చి క్షమాపణ చెప్పిస్తే బాగుండేదని వైసీపీ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
వివాదాస్పద కామెంట్స్‌తో ముదిరిన వివాదం
ఇంతటితో ఈ ‘లైలా బాయ్‌కాట్’ వివాదం సద్దుమణుగుతుందో లేదో చూడాలి. రామ్ నారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఇటీవల జరిగింది. ఈ ఫంక్షన్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ ప్రీ రిలీజ్ వేడుకలో ‘లైలా’ చిత్ర నటుడు థర్టీ ఇయర్స్ పృథ్వీ చేసిన వివాదాస్పద కామెంట్స్ వైసీపీ రాజకీయ నాయకులను బాధపెట్టింది. ఇక వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో ‘బాయ్‌కాట్ లైలా’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు మొదలుపెట్టారు.