Israeli Prime Minister Netanyahu reacts to the death of Ratan Tata

రతన్ టాటా మరణంపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

న్యూఢిల్లీ: భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణంపై ప్రపంచ దేశాల అధినేతలు సంతాపాలు తెలియజేస్తున్నారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమన్ నెతన్యాహు స్పందించారు. భారత్-ఇజ్రాయెల్ మధ్య స్నేహ బంధానికి ఛాంపియన్‌గా రతన్ టాటాను ఆయన కొనియాడారు. ఈమేరకు ఎక్స్ వేదికగా సంతాప సందేశాన్ని పంచుకున్నారు. ‘భారత్ గర్వించదగిన కొడుకు’ అని కొనియాడారు. భారత్-ఇజ్రాయెల్ సంబంధాలను పెంపొందించడంలో రతన్ టాటా ముఖ్య పాత్ర పోషించారని అన్నారు.

‘‘ఇజ్రాయెల్‌లోని చాలామంది ప్రజలతో పాటు నేను కూడా రతన్ టాటా మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. రతన్ టాటా భారతదేశం గర్వించదగిన కొడుకు. మన రెండు దేశాల మధ్య స్నేహబంధానికి ఛాంపియన్ అయిన రతన్ టాటాను కోల్పోవడం విచారకరం. దయచేసి రతన్ కుటుంబానికి నా సానుభూతిని తెలియజేయండి’’ అని ఎక్స్ వేదికగా ప్రధాని మోడీని బెంజమన్ నెతన్యాహు కోరారు. కాగా రతన్ టాటా మరణం పట్ల ఇజ్రాయెల్ ప్రధానితో పాటు అనేక మంది ప్రపంచ నాయకులు సంతాపాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

కాగా, టాటా గ్రూప్, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ అయిన రతన్ టాటా అక్టోబర్ 9న కన్నుమూశారు. 86 సంవత్సరాల వయస్సులో చనిపోయారు. మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. వ్యాపార, రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Related Posts
కొనసాగుతున్న అమెరికా చైనా వాణిజ్య యుద్ధం
అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు: మంత్రి కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై అదనంగా 10% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించడంతో, బీజింగ్ "అవసరమైన అన్ని ప్రతిఘటనలు" తీసుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. ట్రంప్ చైనా Read more

సింగిల్ పేరెంట్ గా లైఫ్ ఎలా ఉంది..? సానియా చెప్పిన సమాధానం ఇదే..!
sania mirza son

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, క్రికెటర్ షోయబ్ మాలిక్ గత ఏడాది జనవరిలో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరి విడాకుల తర్వాత సానియా తన Read more

‘దసరాకే కాదు. దీపావళి’కి కూడా రైతులను దివాలా తీయిస్తారా..? – కేటీఆర్
ACB notices to KTR once again..!

మాజీ మంత్రి కేటీఆర్ మీడియా కథనాలపై స్పందిస్తూ, రైతుల సమస్యలపై ప్రభుత్వ వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేశారు. “దసరాకే కాదు, దీపావళికి కూడా రైతులను దివాలా తీయిస్తారా?” Read more

AP Govt: నేడు ఏపీలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభం
Ashok Leyland plant to be inaugurated in AP today

AP Govt: నేడు ఏపీలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభం కానుంది. మల్లవల్లిలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ను ఈరోజు సాయంత్రం 5గంటలకు మంత్రి లోకేష్ ప్రారంభించనున్నారు. Read more