లండన్‌లోని ప్రసిద్ధ గోవిందాస్ రెస్టారెంట్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఇది ఇస్కాన్ సంస్థ (ISKCON organization) నడిపే శుద్ధ శాకాహార భోజనశాల. హిందూ సంప్రదాయాలపై ఆధారపడిన ఈ ప్రదేశం శాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి.ఒక ఆఫ్రికన్-బ్రిటిష్ యువకుడు (African-British young man) రెస్టారెంట్‌లోకి ప్రవేశించాడు. అక్కడ మాంసాహారం లభిస్తుందా అని సిబ్బందిని ప్రశ్నించాడు. “ఇది శాకాహార హోటల్” అని చెప్పగానే, అతను తన బ్యాగ్ నుంచి కేఎఫ్‌సీ చికెన్ బాక్స్ తీసాడు. తాను తెచ్చిన మాంసాన్ని అక్కడే తినడం మొదలుపెట్టాడు.తిన్నతరువాత అక్కడే ఉన్నవారికి చికెన్ ఆఫర్ చేశాడు. “ఫ్రీ ది చికెన్!” అంటూ గట్టిగా కేకలు వేశాడు. “ఇక్కడ మాంసం లేదు, ఉల్లిపాయ లేదు, వెల్లుల్లి లేదు” అంటూ వ్యాఖ్యానించాడు. ఇతని ప్రవర్తన కస్టమర్లను అసహనానికి గురి చేసింది.

వీడియో వైరల్ – నెటిజన్ల ఆగ్రహం
ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. “ఇది హిందూ మతాన్ని అవమానించడమే” అని ఒకరు మండిపడ్డారు. మరొకరు “ఇది మత విద్వేషానికి నిదర్శనం” అన్నారు. చాలా మంది ఈ చర్యను కావాలనే ప్లాన్ చేసి చేసినదిగా భావించారు.సిబ్బంది అతన్ని వెళ్లిపోవాలని కోరినా వినలేదు. అక్కడే నిరసనగా గందరగోళం సృష్టించాడు. చివరికి సెక్యూరిటీ జోక్యంతో అతన్ని బయటకు పంపించారు. ఈ ఘటన ఇస్కాన్ అనుయాయుల మనసులను బాధించింది.
ఇస్కాన్ విలువలకు అవమానం
ఇస్కాన్ రెస్టారెంట్‌లు మాంసాహారాన్ని పూర్తిగా నిషేధిస్తాయి. ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి పదార్థాలకూ ఆమోదం లేదు. ఈ సంఘటన వారి ధార్మిక విలువలకు అవమానంగా మిగిలింది. అనేకమంది ఇది ఆచారాలపై తీవ్రమైన దాడి అని భావిస్తున్నారు.
Read Also : రష్యాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదు