మన శరీరంలో గుండె ఎంతో ముఖ్యమైన అవయవం. ఇది నిరంతరం పనిచేస్తూ శరీరానికి అవసరమైన రక్తాన్ని పంపిణీ చేస్తుంది. అయితే, నేటి జీవనశైలిలో మార్పుల కారణంగా గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ లాంటి శీలాలు పాటించకపోతే గుండె ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది.అయితే, గుండె జబ్బులు ఉన్నవారు వ్యాయామం చేయాలంటే భయపడాల్సిన అవసరం లేదు. సరైన వ్యాయామం, ముఖ్యంగా నడక, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. నడక అనేది సులభంగా చేయగలిగినది, ఖర్చు లేనిది, అంతేకాకుండా గుండెకు మేలు చేసే వ్యాయామం.
నడకతో గుండె ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు
గుండె కండరాలు బలంగా మారడం,నడక వల్ల గుండె కండరాలు మరింత బలంగా మారతాయి.బలమైన గుండె సమర్థవంతంగా రక్తాన్ని పంపిణీ చేస్తుంది.శరీరంలోని అన్ని అవయవాలకు తగినంత రక్తప్రసరణ జరుగుతుంది.అధిక రక్తపోటు గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.నిత్యం నడవడం ద్వారా రక్తపోటును తగ్గించుకోవచ్చు.కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం,నడక చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలు గుండెను రక్షించడానికి సహాయపడతాయి.
బరువు నియంత్రణ
అధిక బరువు గుండెపై అదనపు భారం పెడుతుంది.నడక ద్వారా కేలరీలుకరుగుతాయి.

ఒత్తిడి తగ్గింపు
ఒత్తిడి గుండె జబ్బులకు ముఖ్యమైన కారణం.నడక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.నడిచినప్పుడు శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి, ఇవి మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం
మధుమేహం ఉన్నవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.నడక వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రితమవుతాయి, దీని ద్వారా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.,నడక ప్రారంభించే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని బట్టి వ్యాయామాన్ని సూచిస్తారు.తగ్గించిన వేగంతో ప్రారంభించడం,మొదటినుంచే ఎక్కువ దూరం నడవకూడదు.నెమ్మదిగా ప్రారంభించి, క్రమంగా నడక సమయాన్ని పెంచాలి.ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. వైద్య సలహా కోసం మీ వైద్య నిపుణుడిని సంప్రదించండి.
వాకింగ్ ట్రాక్
నడక ప్రారంభించే ముందు వైద్యుడి సలహా తప్పనిసరి.మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి, ఎంత నడవాలి అనేది నిర్ణయించుకోవాలి.నెమ్మదిగా ప్రారంభించాలి,ఒక్కసారిగా ఎక్కువ దూరం నడవకూడదు.రోజూ క్రమంగా నడక సమయాన్ని పెంచుకోవాలి.మొదట 10-15 నిమిషాలు నడిచి, తర్వాత 30-40 నిమిషాలకు పెంచుకోవచ్చు.సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి,ఫ్లాట్‌మైన, ట్రాఫిక్ రహిత ప్రాంతాల్లో నడవడం మంచిది.పార్క్‌లలో లేదా వాకింగ్ ట్రాక్‌లలో నడవడం ఉత్తమం.నడుస్తున్నప్పుడు నొప్పిగా అనిపిస్తే వెంటనే ఆపేయాలి.శరీరం అలసిపోయే వరకు నడవకూడదు.