పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం మొదలు కాబోతోందా? ఇప్పటికే ఇండియన్ ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు ప్రధాని మోదీ. మన వీర జవాన్లు పాక్‌కి ఎలా బుద్ధి చెప్పనున్నారు? ఈ నెల 9లోపు సైనిక చర్య షురూ కానుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.వరుసగా అధికార వర్గాలతో మోదీ భేటీ అవుతుండటం ఉత్కంఠ రేపుతోంది.సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్‌కు సూటిగా మోదీ వార్నింగ్ ఇచ్చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైందా? రివెంజ్ యాక్షన్ ప్లాన్ రెడీ అయిందా? ఈ నెల 9న జరగనున్న రష్యా విక్టరీ పరేడ్‌కు మోదీ, రాజ్‌నాథ్ సహా భారత్ అగ్ర నేతలు ఎవ్వరూ వెళ్లడం లేదు. రష్యా టూర్ రద్దు చేసుకుని మరీ మోదీ అదే కసరత్తులో ఉన్నారా? భద్రత, యాక్షన్ ప్లాన్‌పై మోదీ, రాజ్‌నాథ్ నేరుగా సమీక్షించడాన్ని ఎలా చూడాలి. ఇక త్రివిధ దళాల అధిపతులతో కీలక సమావేశాలు పూర్తయ్యాయి. దేశవిదేశాలతో దౌత్యపరమైన సంప్రదింపులు పూర్తయ్యాయి.
సురక్షితం
ఈ నెల 9లోపు పాకిస్తాన్‌పై సైనిక చర్య షురూ కానుందా? అసలు సైనికచర్య అంటే ఏంటి? డైరెక్టుగా ఉగ్రవాదులను లేపేస్తే అవి సర్జికల్ స్ట్రైక్స్. ఆ ఉగ్రవాదుల వెనుక ఉన్న పాక్‌కి బుద్ధి వచ్చేలా యుద్ధం ప్రకటిస్తే అది సైనిక చర్య. దీనికోసమే ఇప్పుడు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక కలలో కూడా ఊహించని రీతిలో ఉగ్రవాదులను శిక్షిస్తామని కొద్ది రోజుల క్రితమే బిహార్‌లో మోదీ చెప్పారు.ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇండియన్ నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి భేటీ అయ్యారు. అరేబియా సముద్రంలో నౌకా దళ సన్నద్ధతపై చర్చించారు. అంతకు ముందు ప్రధాని మోదీతో జమ్ముకశ్మీర్ సీఎం అబ్దుల్లా భేటీ అయ్యారు. జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై చర్చించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మోదీతో ఆయనకు ఇది తొలి సమావేశం కావడం గమనార్హం.జమ్మూ కాశ్మీర్‌లో ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడం, పర్యాటకాన్ని సురక్షితంగా మార్చడం, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను పెంచడం వంటి అంశాలపై ఒమర్ అబ్దుల్లా ప్రధానమంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, ప్రధానమంత్రితో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలపై ముఖ్యమంత్రి ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. సమావేశం గురించిన సమాచారం మాత్రమే అధికారికంగా ఇవ్వడం జరిగింది.

అధికార
ప్రతీకారం ఎప్పుడు? ఎక్కడ? ఎలా? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనుందా? తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Read Also :Union Minister: పాకిస్థాన్‌పై ప్రతీకారం తీసుకునే వరకు బొకేలు తీసుకోను: సీఆర్ పాటీల్