ఇరాన్ తొలి సుప్రీం లీడర్, ‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్’ వ్యవస్థాపకుడు అయతుల్లా రూహుల్లా ఖుమేనీ(Ayatollah khomeini) పూర్వీకులు భారత్‌కు చెందినవారు. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషన్(Iran-Islamic Revolution) కు పితామహుడిగా పిలిచే అయతుల్లా రూహుల్లా ఖుమేనీ తాత ‘సయ్యద్ అహ్మద్ ముసావీ హిందీ’ భారత్(India)లోని ఒక చిన్న గ్రామంలో 1790 ప్రాంతంలో జన్మించారు. రూహుల్లా ఖుమేనీ తాతకు 40 ఏళ్ల వయసున్నప్పుడు అవధ్ నవాబు(Avad Navab)తో కలిసి ఆయన ఇరాక్ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లారు. అక్కడి నుంచి ఇరాన్‌లో పలు ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించి, ఇరాన్‌లోని ఖొమైన్ అనే గ్రామంలో స్థిరపడ్డారు.కానీ, తన భారతీయ మూలాలు గుర్తు చేసుకునేలా ఇంటి పేరులో ‘హిందీ’ని కొనసాగించారు. ఆయన కొడుకు ‘అయతుల్లా ముస్తాఫా హిందీ’ ఇస్లాంకు సంబంధించి గొప్ప పండితుల్లో ఒకరిగా మారారు.
ఇస్లామిక్ రిపబ్లిక్
రూహుల్లా జన్మించిన ఐదు నెలలకు ఆయన తండ్రి సయ్యద్ ముస్తాఫా హిందీ హత్యకు గురయ్యారు. ముస్తాఫా హిందీ మరణించడంతో రూహుల్లాను ఆమె తల్లి, అత్తయ్య పెంచారు. ఆయన తన పెద్దన్న ముర్తాజా పర్యవేక్షణలో ఇస్లామిక్ విద్య నేర్చుకున్నారు.
రూహుల్లా ఖుమేనీకి ఇస్లామిక్ న్యాయశాస్త్రం, షరియాపై ప్రత్యేక ఆసక్తి ఉంది. దీంతో పాటు ఆయన పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా అధ్యయనం చేశారు. ఇరాన్ నగరాలు అరాక్, ఖోమ్‌లలో ఇస్లామిక్ విద్యా సంస్థలలో చదువుకోవడమే కాకుండా అక్కడ బోధించారు కూడా. ఆ సమయంలో ఆయన రాచరిక వ్యవస్థను వ్యతిరేకించడం ప్రారంభించారు.

ఇరాన్ నుంచి బహిష్కరించారు
పహ్లావి సుల్తాన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో ఆయన్నుఇరాన్ నుంచి బహిష్కరించారు. మరోవైపు ఇరాన్ ప్రజలు రూహుల్లా ఖుమేనీని తమ నేతగా అంగీకరించారు. ఖుమేనీ నాయకత్వంలో ప్రజలు, ఇతర ప్రతిపక్ష రాజకీయ గ్రూప్‌లు ఏకమయ్యాయని పహ్లావి పాలన గుర్తించింది. దీంతో ఖుమేనీని భారతీయ, బ్రిటిష్ ఏజెంట్‌గా చూపించేందుకు 1978 జనవరి 7న ఇత్తెలాత్ వార్తా పత్రిక.. ఖుమేనీని భారతీయ సంతతికి చెందిన ‘ ముల్లా’ గా పేర్కొంది. బ్రిటిష్-ఇండియన్ కాలనీకి చెందిన బంటుగా ఖుమేనీని పేర్కొంది. ఈ కథనం ప్రచురితమైన తర్వాత ఇరాన్ రివల్యూషన్ మరింత తీవ్రమైంది.
ఇస్లామిక్ రిపబ్లిక్‌ను స్థాపించారు
ఖుమేనీ ఇరాన్‌కు తిరిగి వచ్చిన తర్వాత రాచరిక వ్యవస్థ స్థానంలో ఇస్లామిక్ రిపబ్లిక్‌ను స్థాపించారు. తన రాజకీయ జీవితంలో ఖుమేనీ ప్రత్యేక గుర్తింపు పొందారు. ‘తూర్పు దేశాలతో, పశ్చిమ దేశాలతో సంబంధం లేదు, ఇస్లామిక్ రిపబ్లిక్‌తో మాత్రమే మాకు సంబంధం’, ‘ అమెరికాకు కూడా ఎలాంటి అధికారం లేదు’ వంటి కీలకమైన వ్యాఖ్యలను చేసేవారు. రూహుల్లా హిందీ పేరుతో ఇర్ఫానా గజల్స్‌ను ఆయన రాసేవారు. తన గజల్స్‌లో సాకి, వైన్, మద్యం, విగ్రహం ఆయన ఆధ్యాత్మిక గమ్యస్థానాలుగా పరిగణించే వారు. 1980 జులై 27న ఇరాన్ చక్రవర్తి ఆర్యమెహర్ మొహమ్మద్ రెజా పహ్లావి దేశానికి దూరంగా తన చివరి శ్వాసను విడిచారు. ఆ తర్వాత తొమ్మిదేళ్లకు 1989 జూన్ 4న అయతుల్లా రూహుల్లా ఖుమేనీ కూడా మృతి చెందారు.
రుహోల్లా మరణం తర్వాత సుప్రీం నేతగా అయతొల్లా అలీ ఖమేనీ
86 ఏళ్ల వయసులో సుప్రీం లీడర్ రుహోల్లా ముసావి ఖమేనీ మరణం తర్వాత, 1989లో ఆయన వారసుడిగా అయతొల్లా అలీ ఖమేనీని మతపెద్దలు ఎంపిక చేశారు. అయతొల్లా అలీ ఖమేనీ 1939లో ఇరాన్‌లో రెండో అతిపెద్ద నగరమైన మషాద్‌లో పుట్టారు. షా మొహమ్మద్ రెజా పహ్లావికి వ్యతిరేకంగా రుహోల్లా అయతొల్లా ఖమీని ప్రారంభించిన మత పోరాటంలో 1962లో అయతొల్లా అలీ ఖమేనీ కూడా చేరారు. రుహోల్లాకు అయతొల్లా అలీ ఖమేనీ శిష్యుడయ్యారు. ఈరోజు తాను చేసే, నమ్మే ప్రతీది కూడా ఇస్లాంకు చెందిన ఖమేనీ దార్శనికత నుంచే వచ్చిందని అయతొల్లా అలీ ఖమేనీ చెబుతుంటారు.
Read Also: Pakistan: పాకిస్థాన్‌లో పెను వరదల తాకిడి: ఒకే కుటుంబంలో 18 మంది గల్లంతు