ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 58 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. అయితే ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్‌కు మరో ఎదురుదెబ్బ తలిగింది. అతడికి ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ భారీ జరిమానా విధించింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా శాంసన్‌కు రూ.24 లక్షల ఫైన్ విధిస్తున్నట్లు తాజాగా వెల్లడించింది.
ఓవర్ రేట్
ఇటీవల చెన్నైతో మ్యాచ్‌లో తొలిసారి స్లో ఓవర్ రేట్‌కు గురైంది.ప్రస్తుత సీజన్‌లో స్లో ఓవర్ రేట్‌కు గురవ్వడం రాజస్థాన్‌కు ఇది రెండోసారి. అయితే ఆ మ్యాచ్‌లో శాంసన్ కెప్టెన్ కాకపోయినా, అతడికి భారీ జరిమానా తప్పలేదు. అంతేకాకుండా ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ 2.2ను రాజస్థాన్ రెండోసారి ఉల్లంఘించినందుకు కెప్టెన్‌తోపాటు జట్టు ప్లేయర్ల (ఇంపాక్ట్ ప్లేయర్ సహా)కు కూడా జరిమానా పడింది.
ఒక్కో వికెట్
బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి 19.2 ఓవర్లలో 159కే ఆలౌట్ అయ్యింది. హెట్‌మయర్ (52 పరుగులు), శాంసన్ (41 పరుగులు), పరాగ్ (26 పరుగులు) మాత్రమే రాణించారు. జైస్వాల్ (6), నితీశ్ రాణా (1), ధ్రువ్ జురెల్ (5), శుభమ్ దూబె (1) విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, రషీద్ ఖాన్ 2, సాయి కిశోర్ 2, సిరాజ్, అర్షద్ ఖాన్, కుల్వంత్ కెజ్రోలియా ఒక్కో వికెట్ పడగొట్టారు.అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 217-6 పరుగుల భారీ స్కోరు చేసింది. సాయి సుదర్శన్ (82 పరుగులు), జోస్ బట్లర్ (36 పరుగులు), షారుక్ ఖాన్ (36 పరుగులు) రాణించగా, రాహుల్ తెవాతియా (24* పరుగులు) చివర్లో దూకుడుగా ఆడాడు. రాజస్థాన్ బౌలర్లలో మహీశ్ తీక్షణ 2, తుషార్ దేశ్‌పాండే 2, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ ఒక్కో వికెట్ తీశారు. కాగా, తాజా గెలుపు గుజరాత్‌కు నాలుగో విజయం కాగా, రాజస్థాన్‌కు ఐదింట్లో మూడో ఓటమి.

ఈ ఐపీఎల్ సీజన్‌లో పలువురు ఆటగాళ్లకు జరిమానా విధించారు. వివాదాస్పద రీతిలో సంబరాలు చేసుకున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు చెందిన దిగ్వేష్ రాఠీకి మూడుసార్లు జరిమానా విధించగా అదే సమయంలో రిషబ్ పంత్, ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మొదటి మూడు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్‌కు నాయకత్వం వహించిన రియాన్ పరాగ్, గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మలకు సైతం జరిమానా విధించారు.
Read also: IPL 2025 :రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ విజయం