हिन्दी | Epaper

Telugu News: Zelensky: రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్

Sushmitha
Telugu News: Zelensky: రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్

నాలుగేళ్లుగా ఎడతెరపిలేకుండా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఎవరికీ ఎవరూ తగ్గడం లేదు. ఇప్పటికే ఈ రెండు దేశాలు ఎంతగానో నష్టపోయాయి. ఇంకా నష్టపోతూనే ఉన్నాయి. ప్రపంచదేశాలన్ని యుద్ధాన్ని ఆపివేయాలని గగ్గోలు పెడుతున్నాయి. ఈ యుద్ధం వల్ల ప్రపంచదేశాలు కూడా ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. అయినా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) ఏమాత్రం తగ్గడం లేదు. ఉక్రెయిన్ (Ukraine) లో ఇప్పటికే చాలాభాగాన్ని పుతిన్ స్వాధీనం చేసుకున్నారు. అయినా ఆయన దాహం తీరడం లేదు. ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్ రష్యాకు గట్టి షాక్ ను ఇచ్చింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో సముద్ర పోరాటం కొత్తమలుపు తీసుకుంది. ఉక్రెయిన్ తొలిసారిగా తమ దేశీయంగా తయారు చేసిన ‘సబ్ సీ బేబీ’ అనే మానవ రహిత నీటి అడుగున డ్రోన్ను ఉపయోగించి రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసినట్లు ప్రకటించింది.

Read Also: Ukraine: భద్రతా హామీలు ఇస్తే అప్పుడు ఆలోచిస్తాం.. జెలెన్ స్కీ

Zelensky
Zelensky Ukraine destroyed Russian submarine

జలాంతర్గామికి తీవ్ర నష్టాన్ని ఇచ్చిన ఉక్రెయిన్

నల్ల సముద్రంలో రష్యా నేవీ ముఖ్య స్థావరమైన నొవోరోసిస్క్ పోర్ట్ నిలిచి ఉన్న రష్యాకు చెందిన కిలో-క్లాస్ జలాంతర్గామిని ఈ డ్రోన్ లక్ష్యం చేసుకుంది. ఈ దాడితో జలాంతర్గామికి తీవ్రనష్టం జరిగిందని, అది పూర్తిగా పనికిరాకుండా పోయిందని ఉక్రెయిన్ భద్రతా సేవ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ జలాంతర్గామి తరచుగా ఉక్రెయిన్ప క్షిపణి దాడులకు ఉపయోగించే ‘కాలిబర్’ క్రూయిజ్ క్షిపణులను మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

నౌకాదళ చరిత్రలో నీటి అడుగున డ్రోన్ ద్వారా జలాంతర్గామిని లక్ష్యంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. నౌకాదళ చరిత్రలో నీటి అడుగున డ్రోన్ ద్వారా జలాంతర్గామిని లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్క సలహాదారు ఒకరు ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఉక్రెయిన్ ఈ దాడికి సంబంధించిన పేలుడు దృశ్యాల వీడియోను కూడా విడుదల చేసింది. మరోవైపు, రష్యా బ్లాక్ సీ ప్లీట్ మాత్రం ఈ దాడిని ఖండించింది. నోవోరోసిస్క్ స్థావరంలోని తమ నౌకలు లేదా జలాంతర్గాములకు ఎటువంటి నష్టం జరగలేదని, అవి యథావిధిగా తమ విధుల్లో ఉన్నాయని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు

ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు

నాటో దేశాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.

నాటో దేశాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.

ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ అధ్యక్షుడి విమానం ధ్వంసం

ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ అధ్యక్షుడి విమానం ధ్వంసం

ప్ర‌ధాని మోదీ వెళ్లిపోగానే..ఇరాన్‌పై దాడి

ప్ర‌ధాని మోదీ వెళ్లిపోగానే..ఇరాన్‌పై దాడి

భారత్‌కు హార్డ్ రాక్ గుడ్ బై!

భారత్‌కు హార్డ్ రాక్ గుడ్ బై!

రంగంలోకి దిగిన ఘోరమైన B-1B లాన్సర్ విమానాలు

రంగంలోకి దిగిన ఘోరమైన B-1B లాన్సర్ విమానాలు

పారిస్‌లో అమెరికా-చైనా వాణిజ్య చర్చలు: ట్రంప్-జి సమ్మిట్‌కు రంగం సిద్ధం!

పారిస్‌లో అమెరికా-చైనా వాణిజ్య చర్చలు: ట్రంప్-జి సమ్మిట్‌కు రంగం సిద్ధం!

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. రాకపోకలు నిలిపివేత

దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. రాకపోకలు నిలిపివేత

ఎన్నిరోజులైనా పొరాడేందుకైనా మేం సిద్ధం

ఎన్నిరోజులైనా పొరాడేందుకైనా మేం సిద్ధం

తన మరణవార్తలపై నెతన్యాహు సెటైర్లు.. కొత్త వీడియోతో పుకార్లకు చెక్!

తన మరణవార్తలపై నెతన్యాహు సెటైర్లు.. కొత్త వీడియోతో పుకార్లకు చెక్!

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

📢 For Advertisement Booking: 98481 12870