రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు అమెరికా మధ్యవర్తిత్వంలో జరుగుతున్న శాంతి చర్చలపై అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇటీవల చేసిన దౌత్యపరమైన సంప్రదింపులకు కీవ్ నుంచి సరైన స్పందన రాకపోవడంపై ఆయన నిరాశ చెందారు. అంతేకాదు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై కీలక కామెంట్స్ చేశారు. శాంతి ప్రతిపాదనను ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఇంకా చదవకపోవడం నాకు కొంచెం నిరాశ కలిగించిందని వ్యాఖ్యానించారు. ఆదివారం వాషింగ్టన్ డీసీలోని కెనెడీ సెంటర్ రెడ్ కార్పెట్ ఈవెంట్‌కు హాజరైన ట్రంప్ విలేకర్లతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యాలు చేశారు. ‘ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇంకా ప్రతిపాదన చదవకపోవడం నాకు కొంచెం నిరాశ కలిగించింది. కొన్ని గంటల క్రితమే ఉక్రెయిన్ ప్రజలు ఆ ప్రతిపాదనను ఇష్టపడ్డారు. కానీ ఆయన చదవలేదు. ఈ శాంతి ప్రణాళికతో రష్యా బాగానే ఉందని నేను నమ్ముతున్నా. ఉక్రెయిన్ ప్రజలు దానిని ఇష్టపడతారు. కానీ ఆయన మాత్రం సిద్ధంగా లేరు’ అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
Read Also: Newzeland: మైనర్ బాలికపై లైంగిక దాడి .. భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష

శాంతి చర్చల నుంచి ట్రంప్ వైదొలిగే అవకాశం
ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఉక్రెయిన్ శాంతి ఒప్పందాన్ని ప్రశ్నార్థకంగా చేశాయి. ఉక్రెయిన్ సీనియర్ అధికారుల అవినీతిపై ఆరోపణలు పెరుగుతున్న కారణంగా తన తండ్రి శాంతి చర్చల నుంచి పూర్తిగా వైదొలిగే అవకాశం ఉందని ఆయన చెప్పడం గమనార్హం. దోహా ఫోరమ్‌లో ట్రంప్ జూనియర్ ఈ కామెంట్స్ చేశారు. ఉక్రెయిన్ దేశం రష్యా కంటే చాలా ఎక్కువ అవినీతిమయం అని అన్నారు. జెలెన్‌స్కీను గొప్ప మార్కెటర్‌గా వర్ణించారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు చర్చల నుంచి వైదొలగుతారా అని విలేకరులు ప్రశ్నించగా, అది కూడా జరగొచ్చని ట్రంప్ జూనియర్ సమాధానమిచ్చారు.
భద్రతా హామీలు, ప్రాదేశిక అంశాలపై నిర్దిష్ట పురోగతి లేదు
మయామిలో ఉక్రెయిన్, అమెరికా ప్రతినిధుల మధ్య మూడు రోజుల పాటు జరిగిన చర్చలు అనంతరం ట్రంప్ జూనియర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మయామిలో జరిగిన చర్చలు బాగానే జరిగినప్పటికీ భద్రతా హామీలు, ప్రాదేశిక అంశాలపై ఎటువంటి నిర్దిష్ట పురోగతి లేదని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ చాలా కాలంగా అవినీతి సమస్యలను ఎదుర్కొంటోంది, శాంతి చర్చల్లో ఉక్రెయిన్ తరఫున కీలకంగా ఉన్న ఆండ్రీ యెర్మాక్ ఇంటిపై నవంబరులో అవినీతి నిరోధక సంస్థలు దాడులు దాడులు చేశాాయి. అనంతరం ఆయన రాజీనామా చేశారు. ఇది సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా, శాంతి ప్రతిపాదనపై జెలెన్‌స్కీ ఏమాత్రం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: