हिन्दी | Epaper

Pahalgam terror attack : షోయబ్‌ అక్తర్ సహా పాకిస్థానీయుల యూట్యూబ్‌ ఛానళ్లపై నిషేధం

sumalatha chinthakayala
Pahalgam terror attack : షోయబ్‌ అక్తర్ సహా పాకిస్థానీయుల యూట్యూబ్‌ ఛానళ్లపై నిషేధం

Pahalgam terror attack : జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్‌ ఛానళ్ల ప్రసారాలను భారత్‌లో నిషేధించింది. పాక్‌ న్యూస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియాకు చెందిన 16 ఛానళ్లపై ఈ వేటు వేసింది. డాన్‌ న్యూస్‌, జియో న్యూస్‌, సామా టీవీ సహా పలు మీడియా ఛానళ్లు, కొంతమంది జర్నలిస్టుల ఖాతాలపై ఈ నిషేధం విధించింది. మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ ఛానల్‌లో కూడా ప్రసారాలు అందుబాటులో లేవు.

 షోయబ్‌ అక్తర్ సహా పాకిస్థానీయుల

భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు

యూట్యూబ్‌లో ఈ ఛానళ్లను తెరవగానే.. ఇందులోని కంటెంట్‌ అందుబాటులో లేదు. జాతీయ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం అనే సందేశం వస్తోంది. ఇప్పటికే పాకిస్థాన్‌ ప్రభుత్వానికి చెందిన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాను భారత్‌లో నిలిపివేసిన విషయం తెలిసిందే. భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన సున్నితమైన కంటెంట్‌, తప్పుదోవ పట్టించే కథనాలను ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలపై ఈ యూట్యూబ్‌ ఛానళ్లను నిషేధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఉగ్ర నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ముమ్మర చర్యలు

ఇకపోతే..పహల్గాం దాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ పోలీసులు స్థానికంగా ఉన్న ఉగ్ర నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పలువురు ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన భద్రతా సిబ్బంది.. తాజాగా విస్తృత స్థాయిలో సోదాలు చేపట్టారు. దోడాలోని పలు నివాసాల్లో పెద్దఎత్తున తనిఖీలు చేస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం లో ఏప్రిల్‌ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్‌ సీమాంతర ఉగ్రవాదాన్ని వీడేవరకూ ఆ దేశంపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన భారత్‌.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాక్‌ జాతీయులను దేశం నుంచి వెళ్లగొట్టింది.

Read Also:Terrorist attack : భారత్‌లోని పాక్ పౌరులకు నేటితోముగియనున్న డెడ్‌లైన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

📢 For Advertisement Booking: 98481 12870