ప్రపంచ తాబేలు దినోత్సవం 2025: ప్రతి సంవత్సరం మే 23న ప్రపంచ తాబేలు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు తాబేళ్లను, తాబేళ్ల లో వివిధ జాతులను కాపాడటానికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రచారం చేస్తారు.తాబేళ్ళు భూమిపై ఉన్న అతి ప్రాచీన జీవులలో ఒకటి. తాబేళ్ళు భూమిపై దాదాపు 20 కోట్ల సంవత్సరాల నుండి ఉన్నాయి. డైనోసార్ల (Dinosaurs)కంటే ముందే ఇవి భూమిపైకి వచ్చాయి. ఇప్పటికీ జీవించి ఉన్నాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 350 కంటే ఎక్కువ జాతుల తాబేళ్ళు ఉన్నాయి.ప్రపంచ తాబేలు దినోత్సవం 2000 సంవత్సరంలో అమెరికన్ తాబేలు రెస్క్యూ సంస్థ ప్రారంభించింది.తాబేళ్ళ జీవితకాలం వాటి జాతిపై ఆధారపడి ఉంటుంది. నీటిలో నివసించే తాబేళ్ళు 20 నుండి 50 సంవత్సరాల వరకు జీవిస్తాయి.సెయింట్ హెలెనా ద్వీపంలో ప్రపంచంలోనే అత్యంత వృద్ధ తాబేలు నివసిస్తుంది. దాని పేరు జోనాథన్(Jonathan).తాబేళ్ళు పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన భాగం. ఇవి నీటి వనరులను శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి.

చూడడానికి
తాబేలు పురాతన సరీసృపాలు. దాదాపు 200 మిలియన్ సంవత్సరాల కాలం నుంచి ఇవి ఉండేవి. అంటే ఇవి పూర్వం డైనోసార్ల కాలం నుంచి ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద తాబేలు లెదర్ బ్యాక్ తాబేలు.ఇది 1000 పౌండ్ల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటుంది. దాదాపు 8 అడుగుల పొడవు ఉంటుంది. తాబేలు షెల్ ఎక్సోస్కెలిటన్(Shell exoskeleton) అని విశ్వసిస్తుంటారు చాలా మంది. షెల్ అనేది సుమారు 50 ఎముకలతో తయారవుతుంది. మానవ అస్థిపంజరం వయసుతోపాటే ఈ షెల్ వయసు ఉంటుంది. తాబేలు చూడడానికి ప్రశాంతంగా కనిపిస్తాయి. కానీ అవి కూడా కుక్కులు, పిల్లులగా అరుస్తాయి. వాటి శబ్ధం కోళ్లు, కుక్కల మాదిరిగా ఉంటుంది.తాబేళ్లు గుడ్లు పెట్టిన తర్వాత వాటిని వదిలేసి వెళ్లిపోతాయి. పిల్లలు పెరిగిన తర్వాత సముద్రంలోకి తమ మార్గాన్ని ఏర్పర్చుకుంటాయి.
Read Also : Contact Lenses: లెన్స్‌లపై శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ!