हिन्दी | Epaper
మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం

Muslim Countries: ఇరాన్‌కు ముస్లిం దేశాలు మద్దతుగా నిలుస్తాయా?

Vanipushpa
Muslim Countries: ఇరాన్‌కు ముస్లిం దేశాలు మద్దతుగా నిలుస్తాయా?

1974 ఫిబ్రవరిలో ఇస్లామిక్ దేశాలకు చెందిన సంస్థ ఇస్లామిక్ సహకార సమాఖ్య (ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్‌ – ఓఐసీ)(Organisation of Muslim Countries OIC) రెండో సదస్సు పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జరిగింది. అప్పటి సౌదీ అరేబియా రాజు ఫైసల్ బిన్ అబ్దుల్- అజీజ్ అల్ సౌద్ ఆ సదస్సుకు హాజరయ్యారు. నాటి పాకిస్తాన్ ప్రధానమంత్రి జుల్ఫీకర్ అలీ భుట్టో ఆ సదస్సులో ప్రసంగిస్తూ, “మాది పేద దేశం. వనరులు పరిమితంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థలను నిర్మించడానికి మా వద్ద డబ్బులు లేవు. ఆర్థికంగా సాయం చేసే శక్తి మాకు లేదు. అయితే, ఇస్లాం కోసం ప్రతీ రక్తపు బొట్టును అర్పించేందుకు క్షణం కూడా అలోచించబోమని అల్లా సాక్షిగా హామీ ఇస్తున్నాను. ఇది కేవలం నోటి మాట కాదు. పాకిస్తాన్ ప్రజలు అల్లా సైనికులు. పాకిస్తాన్ సైనికులు కూడా అల్లా సైనికులే. భవిష్యత్‌లో ఎలాంటి సంఘర్షణ తలెత్తినా పాకిస్తాన్ సాయం అందిస్తుంది” అని చెప్పారు.
ఇస్లాం కోసం జుల్ఫీకర్ అలీ భుట్టో ప్రతిజ్ఞ
ఇస్లాం(Islam) కోసం రక్తం చిందిస్తామని జుల్ఫీకర్ అలీ భుట్టో(Bhutto) ప్రతిజ్ఞ చేస్తున్న సమయానికి ఇరాన్‌(Iran)లో ఇస్లామిక్ విప్లవం రాలేదు. సద్దాం హుస్సేన్ ఇరాన్‌పై దాడి చేయలేదు. ఈజిప్ట్, జోర్డాన్, యూఏఈ, బహ్రెయిన్, మొరాకో, సూడాన్ ఇజ్రాయెల్‌ను గుర్తించలేదు. యెమెన్‌పై సౌదీ అరేబియా దాడి చేయలేదు. ఖతార్‌పై సౌదీ, బహ్రెయిన్, ఈజిప్ట్, యూఏఈ దిగ్బంధం విధించలేదు. పాకిస్తాన్(Pakistan) నుంచి బంగ్లాదేశ్(Bangladesh) విడిపోయింది. అయినప్పటికీ జుల్ఫీకర్ అలీ భుట్టో ఇస్లామిక్ దేశాల ఐక్యత గురించి ఆశతో ఉన్నారు.ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ముస్లిం దేశాలన్నీ ఏకం కావాలని పాకిస్తాన్ మళ్లీ కోరుకుంటోంది. పాకిస్తాన్ అణుబాంబు తయారు చేసినప్పటికీ, పశ్చిమ దేశాలు అనేక ఇస్లామిక్ దేశాలలో తాము చెప్పినట్లు వినే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఉదాహరణకు.. ఇరాక్, లిబియా, సిరియాల్లో పాశ్యాత్య దేశాలను వ్యతిరేకించే పాలకులు అధికారంలో లేరు.

Muslim Countries: ఇరాన్‌కు మస్లిం దేశాలు మద్దతుగా నిలుస్తాయా?
Muslim Countries: ఇరాన్‌కు మస్లిం దేశాలు మద్దతుగా నిలుస్తాయా?

ముస్లిం దేశాల మధ్య విబేధాలు
ఇజ్రాయెల్ జూన్ 12 నుంచి ఇరాన్‌పై దాడులు చేస్తోంది. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తోంది. ఈ రెండు దేశాల మధ్య ఘర్షణల ప్రభావం ఇప్పుడు పశ్చిమాసియా అంతటా కనిపిస్తోంది. అనేకమంది ఇది ఇస్లాంకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంగా అభివర్ణిస్తున్నారు. ముస్లిం దేశాలన్నీ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఏకం కావాలని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ గత వారం పాక్ నేషనల్ అసెంబ్లీలో పిలుపునిచ్చారు.ఇలాంటి పరిస్థితుల్లో, ముస్లిం దేశాలన్నీ ఏకం కాగలవా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక్కడ మరో ప్రశ్న ఏంటంటే, పాకిస్తాన్ పదే పదే ముస్లిం దేశాల ఐక్యత గురించి ఎందుకు మాట్లాడుతోంది? ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలన్నీ ఐక్యంగా స్పందించాలని పాకిస్తాన్ కోరుకుంటోంది.

సౌదీ అరేబియా – ఇరాన్ మధ్య శత్రుత్వం
సున్నీ – షియా నుంచి, షియా మెజార్టీ ముస్లిం దేశం అజర్‌బైజాన్‌. అయినప్పటికీ, మరో షియా మెజార్టీ దేశం ఇరాన్‌తో దానికి విరోధం ఉంది. అలాగే, అజర్‌బైజాన్ ఇజ్రాయెల్‌కు సన్నిహిత దేశం. ఇరాక్‌పై అమెరికా దాడి చేసి, సద్దాం హుస్సేన్‌ను ఉరి తీసినప్పుడు అమెరికాకు ఇరాన్ వ్యతిరేకం కాదు. ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం కొనసాగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా గుర్తించడంతో పాటు దానితో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని ఈజిప్ట్ నిర్ణయించింది. 1994లో జోర్డాన్ కూడా ఇజ్రాయెల్‌ను గుర్తించింది. 2
తుర్కియే ద్వంద్వ ప్రమాణాలు
ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకున్నందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్‌లపై తుర్కియే విమర్శలు గుప్పించింది. ఆ విమర్శలు చేసే నాటికి తుర్కియేకు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు ఉన్నాయి. తుర్కియే- ఇజ్రాయెల్ మధ్య దౌత్య బంధం 1949 నుంచే ఉంది. ఇజ్రాయెల్‌ను గుర్తించిన తొలి ముస్లిం మెజారిటీ దేశం తుర్కియే. 2005లో ఎర్దోవాన్ ఒక వ్యాపారవేత్తల బృందంతో రెండురోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నాటి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి ఏరియల్ షారోన్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం “ఇరాన్ అణు కార్యక్రమం ఇజ్రాయెల్‌కే కాకుండా మొత్తం ప్రపంచానికే ముప్పు” అని అన్నారు.
పాకిస్తాన్‌పై విపరీతమైన ఒత్తిడి
“ప్రస్తుతం పాకిస్తాన్‌పై విపరీతమైన ఒత్తిడి ఉంది. భారత్‌తో ఇటీవలి సంఘర్షణ వల్ల పాకిస్తాన్ చాలా నష్టపోయింది. అంతర్జాతీయ వ్యవహారాల్లో తన ప్రాధాన్యం తగ్గకుండా చూసుకునేందుకు పాకిస్తాన్ ఇలాంటి ప్రకటనలు చేస్తోంది. పాకిస్తాన్ తుర్కియే మధ్య బంధం బలపడింది. పాక్ ఇరాన్‌తోనూ సంబంధాల్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో పాకిస్తాన్ అఫ్గానిస్తాన్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచి తుర్కియే, పాకిస్తాన్, ఇరాన్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. పాకిస్తాన్ మరోసారి ఆ బంధానికి ప్రాధాన్యం ఇస్తోందని” చెప్పారు. “ఐక్యరాజ్య సమితి తీర్మానాలనే పట్టించుకోవడం లేదు.
ఇరాన్ ఓడిపోతే ఏమవుతుంది?
ప్రస్తుతానికి వస్తే, కొన్ని నెలల క్రితం సిరియాలో ఇరాన్ అనుకూల ప్రభుత్వాన్ని తుర్కియే సాయంతో కూల్చివేశారు. ఒక విధంగా చెప్పాలంటే సిరియాలో తుర్కియే చేతిలో ఇరాన్ ఓడిపోయింది. ఎక్స్‌లో ఒక పోస్టులో ఎర్దోవాన్ ఇజ్రాయెల్ గురించి ఇలా రాశారు.
“పశ్చిమ దేశాల మద్దతుతో ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది. ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేసింది. ఈ ప్రాంతంలో ప్రతీ దేశాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇజ్రాయెల్ ఏం చేస్తుందో ఆ దేశానికైనా తెలుస్తుందా?” అని అందులో రాశారు. “భవిష్యత్తులో అది తన తప్పును గ్రహించే అవకాశం ఉంది. అయితే, అప్పటికి చాలా ఆలస్యం అవుతుందేమోనని భయపడుతున్నాం. పురాతన కాలంలో ఏ దేశానికీ సొంత సరిహద్దులు లేదా పరిపాలన లేదని ఇజ్రాయెల్ గుర్తుంచుకోవాలి.
ఈ యుద్ధంలో ఇరాన్ ఓడిపోతే ఏమవుతుంది?
“ఈ యుద్ధంలో ఇరాన్ ఓడిపోతే పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ప్రభావం మరింత పెరుగుతుంది. సిరియా నుంచి బషర్ అల్ అసద్‌ను ఇప్పటికే బహిష్కరించారు. ఇరాన్ మద్దతిస్తున్న సాయుధ గ్రూపులు బలహీన పడ్డాయి. గాజా శిథిలాల దిబ్బగా మారింది. వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ ఏది కావాలనుకుంటే అది చేస్తుంది. ఇరాన్ బలహీనపడితే పశ్చిమాసియాలో రష్యా ప్రభావం కూడా తగ్గుతుంది. చైనా చమురు అవసరాల కోసం గల్ఫ్‌లోని అమెరికా మిత్ర దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది” అని ది హిందూ పత్రికలో ఇంటర్నేషనల్ ఎడిటర్ స్టాన్లీ జానీ రాశారు.

Read Also: Thailand PM: ఒక్క ఫోన్ కాల్..10 నెలలకే థాయ్‌లాండ్ పీఎంకు పదవీగండం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మెస్సీ రాకతో ఉప్పల్ అలర్ట్: ఫుట్‌బాల్ మ్యాచ్‌ భద్రతపై డీజీపీ పర్యవేక్షణ

మెస్సీ రాకతో ఉప్పల్ అలర్ట్: ఫుట్‌బాల్ మ్యాచ్‌ భద్రతపై డీజీపీ పర్యవేక్షణ

రష్యా వైపు భారత్: ట్రంప్ వైఖరిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ సభ్యురాలు

రష్యా వైపు భారత్: ట్రంప్ వైఖరిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ సభ్యురాలు

అమెరికా-భారత్ బంధం బలోపేతం: రక్షణ, వాణిజ్యంపై చర్చ

అమెరికా-భారత్ బంధం బలోపేతం: రక్షణ, వాణిజ్యంపై చర్చ

అమెరికా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భారతీయ విద్యార్థిని

అమెరికా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భారతీయ విద్యార్థిని

ప్రపంచాన్ని వెనక్కి నడిపిస్తున్న ట్రంప్

ప్రపంచాన్ని వెనక్కి నడిపిస్తున్న ట్రంప్

ఆడపిల్లని తెలిస్తే అబార్షన్ చేయిస్తున్న భారతీయ దంపతులు

ఆడపిల్లని తెలిస్తే అబార్షన్ చేయిస్తున్న భారతీయ దంపతులు

భారత్‌పై 50 శాతానికి సుంకాలు పెంపు.. మెక్సికో

భారత్‌పై 50 శాతానికి సుంకాలు పెంపు.. మెక్సికో

Googleలో వైరల్ అవుతున్న ‘777’ – అసలు కథ ఏమిటి?

Googleలో వైరల్ అవుతున్న ‘777’ – అసలు కథ ఏమిటి?

గోల్డ్ కార్డ్‌తో ప్రతిభావంతులను నియమించుకోవచ్చు

గోల్డ్ కార్డ్‌తో ప్రతిభావంతులను నియమించుకోవచ్చు

ల‌క్ష‌లాది మంది భార‌తీయుల‌కు ఏఐపై నైపుణ్య శిక్ష‌ణ ఇస్తాం: స‌త్యా నాదెళ్ల‌

ల‌క్ష‌లాది మంది భార‌తీయుల‌కు ఏఐపై నైపుణ్య శిక్ష‌ణ ఇస్తాం: స‌త్యా నాదెళ్ల‌

ఎయిర్ టెల్, జియోతో స్టార్‌లింక్ పోటీ కష్టమేనా?

ఎయిర్ టెల్, జియోతో స్టార్‌లింక్ పోటీ కష్టమేనా?

ఎట్టకేలకు థాయ్‌లాండ్‌లో అరెస్ట్ అయిన లూథ్రా బ్రదర్స్

ఎట్టకేలకు థాయ్‌లాండ్‌లో అరెస్ట్ అయిన లూథ్రా బ్రదర్స్

📢 For Advertisement Booking: 98481 12870