అహ్మదాబాద్(Ahmedabad) ఎయిర్‌పోర్టు నుంచి లండర్ బయల్దేరిన విమానం(Plane) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే పైలట్‌లు ఇద్దరు ఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ చేశారు. ఆ తర్వాత ఎలాంటి మాటలు వినిపించలేదని, నిశ్శబ్ద వాతావరణం ఏర్పడినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు.
ఎయిరిండియా విమానం గురువారం మధ్యాహ్నం 1.39 గంటలకు ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో పాటు 242 మంది ప్రయాణికులతో లండన్(London) బయల్దేరింది. ఇక ఈ విమానం పైలట్ సుమిత్ సబర్వాల్(Sumith Sabarwal) ఆధ్వర్యంలో బయల్దేరింది. విమానానికి ఫస్ట్ ఆఫీసర్‌గా పైలట్ క్లైవ్ కుందర్(Kliv Kundan) ఉన్నారు. సుమిత్ సబర్వాల్‌కు 8,200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉంది. కోపైలట్‌కు 1100 గంటలకు విమానం నడిపిన అనుభవం ఉంది.

సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
విమానం జనావాసాలపై కుప్పకూలడంతో అధిక నష్టం జరిగింది. మంటలు ఎగిసి పడడంతో అక్కడ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. 90 మంది చొప్పున మూడు బృందాలు సహాయక చర్యలను వేగవంతం చేశారు. ఈ విమాన ప్రమాదాన్ని ఎయిరిండియా అధికారికంగా ధృవీకరించింది.
ప్రమాద వివరాలు
విమాన టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, పైలట్లు ఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ చేశారు. తదనంతరం ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా విమానం కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో విమానం జనావాసాలపై కూలడంతో, మంటలు చెలరేగి, దట్టమైన పొగలు అలుముకున్నాయి. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 90 మంది చొప్పున మూడు బృందాలుగా ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం కారణంగా విమానం కూలిపోయినట్లు తెలుస్తోంది. అయితే, పూర్తి దర్యాప్తు నివేదిక ఇంకా అందుబాటులో లేదు.
Read Also: Ahmedabad: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ?