అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్’ (One Big Beautiful Bill Act) సెనేట్‌లో ఆమోదం పొందింది. ఈ బిల్లు పూర్తిగా ట్రంప్ రాజకీయ అజెండా ఆధారంగా రూపొందించబడింది. ముఖ్యంగా అమెరికా భద్రత, ఆర్థిక వ్యవస్థలో వ్యయ నియంత్రణ, దేశీయ వనరుల వినియోగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రూపొందించారని ఆయన వర్గం వెల్లడించింది. ఇప్పుడు ఇది ప్రతినిధుల సభలో ఆమోదానికి సిద్ధంగా ఉంది.
ట్యాక్స్ తగ్గింపు, ఖర్చుల నియంత్రణకు ప్రాధాన్యం
ఈ బిల్లులో ప్రధానంగా ట్యాక్స్ కట్స్ (పన్నుల తగ్గింపు), ప్రభుత్వ ఖర్చుల్లో తగ్గింపు, బోర్డర్ భద్రత వంటి అంశాలకు ప్రాధాన్యం ఉంది. ట్రంప్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఈ బిల్లు రూపుదిద్దుకుంది. ఇందులో భాగంగా మెక్సికో-అమెరికా సరిహద్దులో గోడ నిర్మాణం కోసం $70 బిలియన్లు, సర్వైలెన్స్ టెక్నాలజీ అభివృద్ధికి నిధులు కేటాయించనున్నారు. అంతేకాక, ప్రజల నుండి పన్నులు తగ్గించి, ప్రభుత్వ ఖర్చులను తగ్గించాలనే నినాదం ఇందులో ప్రతిబింబిస్తుంది.
రక్షణ ఖర్చులు, ఎనర్జీ రంగానికి మద్దతు
ఈ బిల్లులో మరో కీలక అంశం డిఫెన్స్ రంగానికి అధిక బడ్జెట్ కేటాయించడం. ట్రంప్ ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం, గోల్డెన్ డోమ్, మిస్సైల్ డిఫెన్స్ వంటి వ్యవస్థల అభివృద్ధికి $150 బిలియన్లకు పైగా నిధులు కేటాయించనున్నారు. అదే విధంగా, అమెరికాలో ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహించేందుకు, ప్రత్యేకించి నూనె, గ్యాస్, శక్తి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ బిల్లు చట్టంగా మారితే, ట్రంప్ విధానాలు అమలులోకి వచ్చి అమెరికా పాలనా దిశను కీలకంగా మార్చే అవకాశం ఉంది.
Read ALso : One Big Beautiful Bill Act ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్’.. ఏం జరుగుతుంది?