हिन्दी | Epaper
అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

తాము చేసిన అభ్యర్థనకు భారత్‌ నుంచి స్పందన రాలేదు: యూనస్‌

sumalatha chinthakayala
తాము చేసిన అభ్యర్థనకు భారత్‌ నుంచి స్పందన రాలేదు: యూనస్‌

ఢాకా: భారత్‌ను మాజీ ప్రధాని షేక్‌ హసీనా అప్పగింతపై అధికారికంగా సంప్రదించినట్లు బంగ్లాదేశ్‌ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ వెల్లడించారు. కానీ, భారత్‌ నుంచి ఇప్పటివరకు అధికారిక సమాధానమేదీ రాలేదని తెలిపారు. అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించారు. రిజర్వేషన్ల వ్యతిరేక నిరసనల్లో పెద్దఎత్తున హింస చెలరేగిన నేపథ్యంలో గతేడాది ఆగస్టులో హసీనా దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి భారత్‌లో ఆమె తలదాచుకుంటున్నారు. హసీనాతో పాటు ఆమె హయాంలోని పలువురు మాజీ మంత్రులు, సలహాదారులు, పలువురు అధికారులు మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారంటూ బంగ్లాదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ వారిపై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. హసీనాతో పాటు ఆమెకు సంబంధించిన వ్యక్తులపై విచారణ జరుగుతుంది అని యూనస్ వెల్లడించారు.

తాము చేసిన అభ్యర్థనకు భారత్‌

ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై ఎటువంటి వ్యాఖ్య చేయలేము

అలాగే తమ అప్పగింత అభ్యర్థనపై భారత్‌ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదని చెప్పారు. షేక్‌ హసీనాను అప్పగించాలంటూ బంగ్లాదేశ్‌ లేఖ రాసిన విషయాన్ని భారత్‌ ఇప్పటికే ధ్రువీకరించింది. షేక్‌ హసీనా అప్పగింతకు సంబంధించి బంగ్లాదేశ్‌ హై కమిషన్‌ నుంచి లేఖ అందింది. ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై ఎటువంటి వ్యాఖ్య చేయలేము అని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి పేర్కొన్న విషయం తెలిసిందే. ఇటీవల అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటుచేసిన ఓ బహిరంగ కార్యక్రమంలో.. హసీనా జూమ్‌కాల్‌ ద్వారా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె కార్యకర్తలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. తాను బంగ్లాకు తిరిగి వస్తానని, పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. గతంలో మాదిరిగానే అందరికీ న్యాయం చేస్తానని అన్నారు. మధ్యంతర ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు గడుస్తున్నా.. అల్లర్లు ఆగట్లేదని అన్నారు. యూనస్ ఓ ఉగ్రవాది అని విమర్శించారు. ఆమెను తమ దేశంలోకి రప్పించడమే తమ అత్యంత ప్రాధాన్యమైన లక్ష్యమని ఆ వ్యాఖ్యలపై తాత్కాలిక ప్రభుత్వం స్పందించింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870