జపాన్(Japan )లోని కాగోషిమా ప్రాంతంలో ఉన్న సకురాజిమా అగ్నిపర్వతం ఈ రోజు భారీగా విస్ఫోటనం (Volcano erupts) చెందిన ఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనను కలిగించింది. మినమిడాకే శిఖరంలో సంభవించిన ఈ పేలుడు ధాటికి పొగలు ఏకంగా 3,000 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. జపాన్ వాతావరణ శాఖ (JMA) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. విస్ఫోటన సమయంలో భారీ శబ్ధాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అగ్నిపర్వతం చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు తాత్కాలికంగా ఇంటి నుండి బయటకు రావద్దని అధికారులు సూచించారు.
జపాన్ వాతావరణ శాఖ లెవెల్-3 అలర్ట్
విస్ఫోటనం జరిగిన వెంటనే జపాన్ వాతావరణ శాఖ లెవెల్-3 అలర్ట్‌ను జారీ చేసింది. ఇది ప్రజలను ఆ ప్రాంతానికి చేరకుండా నివారించేందుకు తీసుకునే జాగ్రత్త చర్యల్లో ఒకటి. అధిక పొగ మరియు బూడిద వర్షం కారణంగా ప్రజలకు శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాతావరణ శాఖ సూచనల ప్రకారం, మైలురాళ్ల దూరంలో ఉన్న గ్రామాలకు బూడిద చేరినట్లు నివేదికలు పేర్కొన్నాయి. స్థానిక విద్యా సంస్థలు మరియు రవాణా వ్యవస్థలు కూడా తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి.
మొత్తం 111 క్రియాశీల అగ్నిపర్వతాలు
జపాన్‌లో మొత్తం 111 క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. వాటిలో సకురాజిమా ఒక ముఖ్యమైన అగ్నిపర్వతంగా గుర్తించబడింది. ఇది గతంలోనూ అనేక సార్లు విస్ఫోటనాలు జరిగిన ప్రదేశం. అగ్నిపర్వతం చుట్టూ నివసించే ప్రజలు ఈ తరహా విస్ఫోటనాలకు సన్నద్ధంగా ఉండేలా ప్రభుత్వ యంత్రాంగం తరచూ అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. ఇప్పటివరకు పెద్దగా ప్రాణనష్టం లేదన్నప్పటికీ, పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
Read Also : Trinamool Congress : తృణమూల్లో చేరిన బీజేపీ మాజీ కేంద్ర మంత్రి