నేరాలు.. హింసలతో బంగ్లాదేశ్ మళ్లీ అట్టుడుకుతున్నది. యువత రోడ్డుపై వచ్చి హింసాత్మక ఘటనతో ఏకంగా ఆదేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్లో తలదాల్చుకుంటున్నది. తాత్కాలిక ప్రధానిగా ముహమ్మద్ యునస్ ఉన్నారు. తాజాగా మరోసారి బంగ్లాదేశ్ లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓ గిరిజన బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం స్థానికంగా జతుల మధ్య చిచ్చు రాజేసింది. ఆదివాసీ తెగలకు, వలస వచ్చిన బెంగాలీ వర్గాలకు మధ్య చెలరేగిన తీవ్ర ఘర్షణల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, సైనికులు, పోలీసులు సహా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. భారీగా భద్రతా(Heavy security) బలగాలను మోహరించినా, హింస అదుపులోకి రాకపోవడంతో ఆగ్నేయ బంగ్లాదేశ్ లోని పలు ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది.
Read Also: China Bridge: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గ్రాండ్ కెన్యన్ వంతెన చైనా లో ప్రారంభం

అత్యాచారానికి గురైన బాలిక
భారత్-మయన్మార్ సరిహద్దుల సమీపంలోని చిట్టగాంగ్ కొండ ప్రాంతమైన ఖద్రాచారి జిల్లాలో మంగళవారం ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ గిరిజన బాలిక ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా సామూహిక అత్యాచారానికి గురైంది. అర్థరాత్రి సమయంలో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. శనివారం నుంచి నిరసనలు ఉదృతం చేసి, టైర్లు కాల్చి, చెట్లను అడ్డంగా వేసి రహదారులను దిగ్బంధం చేశాయి. దీంతో ఆదివారం నాటికి ఈ ఆందోళనలు హింసాత్మక(Violent) ఘర్షణలుగా మారాయి.
ఇళ్లకు నిప్పు పెట్టిన దుండగులు
ఖగ్రాఛారి జిల్లా కేంద్రంలో మొదలైన అల్లర్లు క్రమంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. ఇరువర్గాల వారు ఒకరి వ్యాపార సమూదాయాలపై, ఇళ్లపై మరొకరు దాడులు చేసుకుంటూ నిప్పు పెట్టారు. దీంతో జిల్లా కేంద్రానికి సమీపంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించారని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ అహ్సాన్ హబీబ్ మీడయాకు చెప్పారు. ఈ ఘర్షణలో 13మంది సైనికులు, ముగ్గురు పోలీసులు కూడా గాయపడినట్లు హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. జిల్లా యంత్రాంగం 144 సెక్షన్ ను విధించింది. సైన్యం, సరిహద్దు భద్రతాదళం, పోలీసులు గస్తీ కాస్తున్నారు. బాలికపై అత్యాచారం కేసులో సైన్యం సాయంతో ఓ బెంగాళీ యువకుడిని అరెస్టు చేశారు.
ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుంది?
బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ కొండ ప్రాంతం, ఖద్రాచారి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
బలాత్కారం బాధితుడు ఎవరు?
ఎనిమిదో తరగతి చదువుతున్న గిరిజన బాలిక, ట్యూషన్ నుంచి ఇంటికి వస్తుండగా ఈ సంఘటనకు గురయ్యింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: