బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో హిందూ యువకుడు అత్యంత oe హత్యకు గురయ్యాడు. ఫెని జిల్లాలోని దగన్‌భుయాన్ ఉపజిల్లాలో 27 ఏళ్ల ఆటోరిక్షా డ్రైవర్ సమీర్ దాస్‌ను దుండగులు దారుణంగా నరికి చంపారు. బంగ్లాదేశ్ (Bangladesh)లో గత 24 రోజుల్లోనే హిందువులపై జరిగిన 9వ దాడి ఇది కావడం గమనార్హం. వరుస హత్యలతో అక్కడి హిందూ సమాజం బిక్కుబిక్కుమంటూ బతుకుతోంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు సమీర్ దాస్ (27) ఆటో నడుపుకుంటూ జీవించే పేద యువకుడు. జగత్‌పుర్ గ్రామానికి చెందిన సమీర్, ఆదివారం సాయంత్రం ఆటో తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి చాలా సమయం గడిచినా అతను ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువుల ఇళ్లలో వెతికారు. కానీ ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం గ్రామస్తులకు జగత్‌పుర్ పొలాల్లో ఒక మృతదేహం కనిపించింది. వెళ్లి చూడగా అది సమీర్ దాస్‌దేనని గుర్తించారు. చలిలో గడ్డకట్టుకుపోయిన స్థితిలో శవం పడి ఉండటం చూసి కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.
Read Also: AP :ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు

ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు
పోలీసుల ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. సమీర్ శరీరంపై తీవ్రమైన కత్తి గాట్లు ఉన్నాయి. దుండగులు అతన్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ విచక్షణారహితంగా నరికి చంపారు. అనంతరం అతని ఆటోరిక్షాను దొంగిలించి పరారయ్యారు. కేవలం ఆటో కోసమే ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టారా? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై దగన్‌భుయాన్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్చార్జ్ మహమ్మద్ ఫైజుల్ అజీమ్ నోమన్ స్పందించారు. “సమీర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం. పోస్టుమార్టం కోసం ఫెని జనరల్ ఆసుపత్రికి తరలించాం. అతని ఆటోరిక్షా కనిపించడం లేదు. బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత ఏర్పడినప్పటి నుంచి మైనారిటీలపై దాడులు పెరిగాయి. ముఖ్యంగా హిందువుల ఇళ్లు, వ్యాపార సంస్థలు, దేవాలయాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: