వెనిజులా(Venezuela) చమురుపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వెనిజులా చమురును అమెరికాకు అప్పగిస్తారని.. దాదాపు 30 మిలియన్ల నుంచి 50 మిలియన్ల బ్యారెళ్ల చమురు స్వాధీనం చేసుకోబోతున్నామని ట్రంప్(Donald Trump) తెలిపారు. చమురు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని రెండు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తానని స్పష్టం చేశారు. అంటే దీనినిబట్టి వెనిజులా చమురును అమెరికా తన స్వాధీనంలోకి తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Read also: America: ట్రంప్ కంటే మోడీకే ప్రజాదరణ అధికం: బ్రెమ్మర్
ఇదిలా ఉంటే వెనిజులాకు చమురు కంపెనీల కార్యనిర్వాహకులతో శుక్రవారం వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ లో ట్రంప్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎక్సాన్,చెవ్రాన్, కోనోకోఫిలిప్స్ ప్రతినిధులు హాజరుకానున్నారు. భవిష్యత్ ప్రణాళికలపై ప్రతినిధులతో ట్రంప్ చర్చిస్తారని ఈ విషయం గురించి తెలిసిన వ్యక్తి వెల్లడించారు.

ట్రంప్ స్వాధీనంలోకి వెనిజులా
గత శనివారం తెల్లవారుజామున అమెరికా(America) అకస్మాత్తుగా వెనిజులాపై దాడి చేసి, ఆదేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అదుపులో తీసుకుని, పెను రాజకీయ సంక్షోభానికి తెరతీశారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకున్నాక అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటనలు చేశారు. చమురు, ఎన్నికలు, ఇన్ఛార్జ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. వెనిజులా భవిష్యత్ ప్రణాళికను ట్రంప్ వెల్లడించారు. ఎన్ బీసీ న్యూస్ తో ట్రంప్ మాట్లాడుతూ వెనిజులాకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించగా.. ఒకే మాటలో ‘నేనే’ అన్నారు.
ఇక వెనిజులాపై అమెరికా యుద్ధం చేయడం లేదని తెలిపారు. అలాగే సమీప భవిష్యత్తులో ఎన్నికలు కూడా నిర్వహించబోమని తేల్చిచెప్పారు. దక్షిణ అమెరికా దేశాన్ని చక్కదిద్దడమే కర్తవ్యం అన్నారు. ప్రస్తుతం మౌలిక సదుపాయాలను పునర్నిర్మించాలని ట్రంప్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అమెరికా సైనిక దాడిలో 32మంది వెనిజులా భద్రతా అధికారులు చనిపోయినట్లుగా నివేదికలు అందుతున్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: