అమెరికా(America)లో భారీ వరదలు.. 24 మంది మృతి, 25 మంది బాలికలు గల్లంతు
అమెరికాలోని టెక్సాస్(Texas, USA)లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వరదలు పోటెత్తాయి. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది బాలికలు గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది వాళ్లకోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. భారీ వర్షాల వల్ల హంట్(Hunt) ప్రాంతంలో గ్వాడలుపే అనే నది ఉప్పొంగుతుంది. దీని ప్రభావం వల్ల చాలావరకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. అనేక నివాసాలు జలమయమయ్యాయి. వీధుల్లోకి భారీగా వరద నీరు చేరాయి.

ఈ వరదల్లో ఇప్పటిదాకా 24 మంది మృతి చెందగా.. 200 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. వాస్తవానికి గ్వాడులుపే నదీ తీరంలోని ప్రముఖ క్రిస్టియన్ క్యాంప్‌లో వేసవి శిక్షణాశిబిరం నిర్వహిస్తున్నారు. ఈ ప్రదేశాన్ని కూడా వరదలు ముంచెత్తాయి. దీంతో 25 మంది బాలికలు గల్లంతయ్యారాని అధికారులు తెలిపారు.
రెస్క్యూ ఆపరేషన్ జోరుగా
గల్లంతైన బాలికల కోసం పదవలు, హెలికాప్టర్ల సహాయంతో భారీ స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 200 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. వాళ్ల ఆచూకి కోసం రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. పడవలు, హెలికాప్టర్ల సాయంతో గాలిస్తున్నారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం గత కొన్ని రోజులుగా భారీ వర్షాలతో దెబ్బతింటోంది. వర్షాల తీవ్రతతో గ్వాడలుపే నది ఉప్పొంగి, హంట్ ప్రాంతాన్ని ముంచెత్తింది.
Read Also: hindi.vaartha.com
Read Also : PM Modi : మోదీకి 25వ అంతర్జాతీయ పురస్కారం