ఇటీవల ఢిల్లీలో(USA) జరిగిన బాంబు పేలుడు ఘటన యావత్ ప్రపంచాన్ని కదిలించింది. భారతదేశానికి ఇదెంతో వ్యథను పుట్టించే సంఘటన. టెర్రరిస్టులు సామాన్యప్రజల ప్రాణాలను టార్గెట్ చేస్తూ, చేస్తున్న బాంబు దాడులపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఢిల్లీ బాంబు పేలుడు కేసుపై భారత అధికారులు చాలావేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే దానికి వెనుక ఎవరు ఉన్నారనేది కనిపెట్టేశారు.
Read Also: TTD: అప్రూవర్ గా ధర్మారెడ్డి.. కల్తీ నెయ్యి కేసులో పెద్ద ట్విస్ట్

పేలుడుపై రూబియో కీలక వ్యాఖ్యలు
దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పేలుడుకు సంబంధించి దర్యాప్తునకు సాయం చేసేందుకు తాము ముందుకొచ్చామని.. కానీ ఆ అవసరం భారత్ కు లేదని వ్యాఖ్యానించారు.
కెనడాలో జీ7 విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు భారత ప్రభుత్వం ఢిల్లీ పేలుడు కేసు విచారణకు ఎన్ ఐఏ 10 మంది అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అలాగే ఈ సంఘటన తర్వాత ఢిల్లీలోని అమెరికా రాయబారి కార్యాలయం కూడా స్పందించింది. ఢిల్లీలో జరిగిన భయంకరమైన పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల గురించి ఆలోచిస్తున్నాం. ఈ బాధ నుంచి వారు త్వరగా బయటపడాలని కోరుకుంటున్నాం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని కొత్త రాయబారి సెర్గియోగోర్ అన్నారు.
మార్కోరూబియోతో జయశంకర్ భేటీ
ఈ జీ7 సమావేశాల్లో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్,(Minister S. Jaishankar) మార్కోరూబియోతో భేటీ అయ్యారు. ఇరువురూ మంత్రులూ భారత, అమెరికా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగానే ఢిల్లీ పేలుడుపై కూడా చర్చించారని తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: