పరాయి దేశంలో ఉన్నప్పుడు పరువుగా బతకాలని పెద్దలు అంటారు. స్వదేశ ఘనతను చాటేలా మన పనులు ఉండాలంటారు. దొంగబుద్ధి ఉన్నవాడు ఎక్కడ ఉన్నా తమ బుద్ధిని మాత్రం మార్చుకోలేరు. అక్రమంగా అమెరికా దేశంలో ప్రవేశించి, బుద్ధిగా పనులు చేసుకోవాల్సింది పోయి అక్కడ కూడా నేరాలకు తెరతీస్తే..ఇక చిప్పకూడు తప్పదు. ఇద్దరు భారతీయులు అమెరికాలో మాదకద్రవ్యాలతో పట్టుబడి, ఇండియా పరువును తీశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అమెరికాలో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఇండియానా రాష్ట్రంలో కొకైన్ ను తరలిస్తున్న ఇద్దరు భారతీయ డ్రైవర్లను అక్కడి అధికారులు అరెస్టు చేశారు.
Read also: Floods: ఇండోనేషియాలో కుండపోత వర్షం..16 మంది మృతి

Massive cocaine trafficking
ఇండియానాలో భారీ డ్రగ్ బస్ట్ – 140 కిలోల కొకైన్ స్వాధీనం
ఈ మేరకు యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పేర్కొంది. చిన్న ట్రక్కుల్లో కొకైన్ తరలిస్తూ పట్టుబడ్డారు. ఈనెల 4న ఇండియానాలో చిన్న ట్రక్కుల్లో కొకైన్ తరలించడాన్ని స్థానిక అధికారులు అడ్డుకున్నారని డీహెచ్ ఎస్ తెలిపింది. సాధారణ తనిఖీల్లో భాగంగా ట్రక్కుల్లోని స్లీపరన బెర్త్ల నుంచి 308 పౌండ్ల (140 కిలోలు) కొకైన్ ను కనుగొన్నట్లు వివరించారు. నిందితులు భారత్ కు చెందిన గుర్ ప్రీత్ సింగ్ (25), జస్వీర్ సింగ్ (30)గా గుర్తించినట్లు వెల్లడించింది. దీన్ని అడ్డుకోకపోయుంటే అనేకమంది అమెరికన్ల ప్రాణాలకు ముప్పు కలిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేసింది.
నిందితులు కాలిఫోర్నియా నుంచి వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్ లు పొందారని పేర్కొంత్ గుర్ ప్రీత్ 2023లో యూఎస్ లోకి అక్రమంగా ప్రవేశించినట్లు గుర్తించామని వెల్లడించింది. తాను భారతీయుడినని, అక్రమంగా యూఎస్ లో ఉంటున్నానని గుర్ ప్రీత్ అంగీకరించినట్లు
తెలిపింది. ఇక జస్వీర్ సింగ్ కూడా 2017లో అక్రమంగానే అమెరికాకు వచ్చినట్లు గుర్తించామని పేర్కొంది. వీరి నుంచి ఇంకా పూర్తి సమాచారాన్ని రాబడుతున్నట్లు అధికారులు తెలిపారు. అమెరికాలో డ్రగ్స్ సరఫరాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Donald Trump పెద్ద యుద్ధమే చేస్తున్నారు. తమ దేశానికి మత్తుపదార్థాలను సరఫరా చేస్తున్నట్లు వెనిజులా దేశంలో ఆరోపణలు చేస్తూ ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: