हिन्दी | Epaper

Trump: గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు

Vanipushpa
Trump: గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు

గ్రీన్ ల్యాండ్ కు సంబంధించి నార్త్‌ అమెరికా ఏరోస్పేస్‌ డిఫెన్స్‌ కమాండ్‌(NORAD) ఈరోజు ఒక ప్రకటనను విడుదల చేసింది. గ్రీన్ ల్యాండ్ (Greenland)కు తమ యుద్ధ విమానాలను పంపినట్లు అందులో తెలిపింది. ఆ ద్వీపంలోని పిటుఫిక్ అంతరిక్ష బేస్ లో యుద్ధ విమానం ల్యాండ్ అయిందని చెప్పింది. నార్త్‌ అమెరికా రక్షణ కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే లక్ష్యంలో భాగంగా దీన్ని మోహరించనున్నట్లు తెలిపింది. దీని గురించి గ్రీన్ ల్యాండ్ ప్రభుత్వానికి ముందుగానే తెలిపామని..డెన్మార్క్ సమన్వయంతోనే ఈ కార్యకలాపాలు జరిగాయని చెప్పింది. అయితే డానిష్ భూభాగంపై అమెరికా నియంత్రణ కోసం అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ పిలుపునిచ్చిన తర్వాత ఈ చర్య జరగడంతో రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి రాజుకున్నాయి. దాంతో పాటూ డెన్మార్క ఈ విషయంపై ఏమీ స్పందించలేదు.

Read Also: BJP: జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్

Trump: గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
Trump: గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు

గ్రీన్లాండ్‌లో కీలకమైన US సైనిక స్థావరం

అంతరిక్ష పర్యవేక్షణ మరియు రక్షణకు బాధ్యత వహించే సంయుక్త US-కెనడా సైనిక సంస్థ NORAD తాలూకా ఈ విమానం దాని మూడు ప్రాంతాలు అయిన అలాస్కా, కెనడా, ఖండాంతర యునైటెడ్ స్టేట్స్ మొత్తం అంతా పర్యవేక్షిస్తుందని చెబుతున్నారు. ఉత్తర అమెరికాను రక్షించడంలో ఇటువంటి మోహరింపులు సాధారణమని..యునైటెడ్ స్టేట్స్, కెనడా, డెన్మార్క్ రాజ్యం మధ్య కొనసాగుతున్న రక్షణ సహకారాన్ని ప్రతిబింబిస్తాయని NORAD కమాండ్ నొక్కి చెప్పింది. ఇక పిటుఫిక్ అంతరిక్ష కేంద్రానికి సంబంధించి..ఇది తులే ఎయిర్ ఫోర్స్ బేస్ అని పిలువబడే పిటుఫిక్ స్పేస్ బేస్. వాయువ్య గ్రీన్లాండ్‌లో కీలకమైన US సైనిక స్థావరం, క్షిపణి హెచ్చరిక, సమాచార మార్పిడిలో కీలక పాత్ర పోషిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

ఇరాన్‌పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

అమెరికాను వణికిస్తున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్

అమెరికాను వణికిస్తున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్

ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్

ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

ఇరాన్ హెచ్చరిక: “ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!”

ఇరాన్ హెచ్చరిక: “ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!”

యుద్ధం.. ఇరాన్‌లో వారం రోజుల్లో 1,300 మంది మృతి

యుద్ధం.. ఇరాన్‌లో వారం రోజుల్లో 1,300 మంది మృతి

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం
0:10

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం

చమురు ఉత్పత్తిని నిలిపేసిన మరో దేశం!

చమురు ఉత్పత్తిని నిలిపేసిన మరో దేశం!

అంతర్జాతీయ చమురు సంక్షోభం: ఉత్పత్తిని నిలిపివేసిన కువైట్!

అంతర్జాతీయ చమురు సంక్షోభం: ఉత్పత్తిని నిలిపివేసిన కువైట్!

6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!

6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!

మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్

మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం : స్త్రీ శక్తికి పాదాభివందనం!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం : స్త్రీ శక్తికి పాదాభివందనం!

📢 For Advertisement Booking: 98481 12870