हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Pakistan:’అమెరికా మా దేశాన్ని టాయిలెట్ పేపర్‌లా వాడి పడేసింది’.. ఖవాజా ఆసిఫ్

Vanipushpa
Pakistan:’అమెరికా మా దేశాన్ని టాయిలెట్ పేపర్‌లా వాడి పడేసింది’.. ఖవాజా ఆసిఫ్

అగ్రరాజ్యం అమెరికా దౌత్య నీతిపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్(Khawaja Asif) సంచలన వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా తమ దేశాన్ని వ్యూహాత్మక ప్రయోజనాల కోసం వాడుకున్న వాషింగ్టన్.. అవసరం తీరాక తమను ఓటాయిలెట్ పేపర్ ముక్కలా విసిరి పారేసిందని ఆరోపించారు. పాక్ నేషనల్ అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన.. గడిచిన కాలంలో పాకిస్థాన్ పాలకులు చేసిన తప్పిదాలు, ఉగ్రవాద చరిత్రపై ఆత్మవిమర్శ చేసుకుంటూ ప్రసంగం చేశారు. అయితే ఇందదుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. ఈ కాామెంట్లు అంతర్జాతీయవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. 1999లో అప్పటి పాక్ సైన్యాధిపతి జనరల్ పర్వేజ్ ముషారఫ్ నేతృత్వంలోని సైన్యం.. ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూల్చే అధికారాన్ని చేజిక్కించుకుందని ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ఇక 2001 తర్వాత అమెరికాతో పాకిస్థాన్ జతకట్టడం తమ దేశానికి తీరని నష్టం చేకూర్చిందని చెప్పారు.

Read Also: New Guidelines: వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్

Pakistan:'అమెరికా మా దేశాన్ని టాయిలెట్ పేపర్‌లా వాడి పడేసింది'.. ఖవాజా ఆసిఫ్
Pakistan:’అమెరికా మా దేశాన్ని టాయిలెట్ పేపర్‌లా వాడి పడేసింది’.. ఖవాజా ఆసిఫ్

అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోకుండా తమను వదిలేసింది

ముఖ్యంగా అమెరికా మద్దతుతో తాలిబన్లను వ్యతిరేకంగా తమ సర్కారు చర్యలు తీసుకుందని చెప్పారు. దీంతో అఫ్గాన్ కూడా తమపై హింసకు పాల్పడిందని.. కానీ అప్పుడు అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోకుండా తమను గాలికొదిలేసిందని వివరించారు. యూఎస్ తన లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి మాత్రమే తమను వాడుకుందని స్పష్టం చేశారు. దాని పర్యవసానం వల్లే నేడు పాకిస్థాన్‌లో ఉగ్రవాదం విలయతాండవం చేస్తోందని అని ఆయన కుండబద్దలు కొట్టారు. గతంలో పాకిస్థాన్‌ను పాలించిన సైనిక నియంతలు జియా-ఉల్-హక్, పర్వేజ్ ముషారఫ్ చేసిన తప్పులను కూడా ఖవాజా ఆసిఫ్ ఎత్తిచూపారు. వారు అఫ్గాన్ యుద్ధంలో పాల్గొన్నది ఇస్లాం కోసం కాదని.. కేవలం ఒక సూపర్ పవర్ (అమెరికా)ను ప్రసన్నం చేసుకోవడానికేనని ఆయన స్పష్టం చేశారు. “మేము మా చరిత్రను నిరంతరం తిరస్కరిస్తూ ఉంటాము. కానీ నిజం ఏంటంటే.. ఈరోజు మేము ఎదుర్కొంటున్న ఉగ్రవాదం అనేది గడిచిన కాలంలో నియంతలు చేసిన తప్పుల పర్యవసానమే” అని ఆయన పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870