ఇరాన్(Iran )పై ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా భారీ బాంబుల దాడులు (America Attack) జరిపిన విషయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమైన న్యూక్లియర్ సైట్లపై జరిగిన ఈ దాడుల ద్వారా అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి.
అమెరికా బేసెస్‌పై ప్రమాదం?
ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసినట్టుగా, యుద్ధ పరిస్థితులు తలెత్తితే మిడిల్ ఈస్ట్‌లో ఉన్న అమెరికా బేసెస్ సురక్షితంగా ఉండవని హెచ్చరించింది. ప్రస్తుతం సిరియా, ఇరాక్, బహ్రెయిన్, కువైట్, కతార్, సౌదీ అరేబియా తదితర దేశాల్లో మొత్తం 19 అమెరికా బేసెస్ ఉన్నాయని అంచనా. వీటిలో దాదాపు 40,000 మంది అమెరికా ట్రూప్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఇరాన్ వర్గాల నుంచి ప్రతీకార చర్యలకు అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు
ఈ పరిణామాలు మిడిల్ ఈస్ట్‌లో శాంతిని తిరిగి దెబ్బతీయనున్న అవకాశముంది. అమెరికా అధికారికంగా యుద్ధంలో చేరితే, ఇది పలు దేశాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. ఇరాన్ ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ క్యూస్షన్ గా మారింది. అణుయుద్ధానికి దారితీసే అవకాశం తక్కువే అయినా, సైనిక స్థాయిలో ఘర్షణలు ముదిరే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Read Also : IND vs ENG: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో చరిత్ర సృష్టించిన బుమ్రా