దాయాది పాకిస్థాన్ కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఏడాది మేలో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ కేవలం 88 గంటల ట్రైలర్ మాత్రమేనని అన్నారు. దాయాది ఏదైనా దుశ్చర్యలకు పాల్పడితే గట్టి గుణపాఠం చెప్పేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) ఈ సందర్భంగా మాట్లాడారు. ‘ఆపరేషన్ సిందూర్ 88 గంటల్లో ముగిసిన ట్రైలర్ మాత్రమే. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులకైనా మేం సిద్ధంగా ఉన్నాం. పాక్ అవకాశం ఇస్తే.. పొరుగుదేశంతో బాధ్యతాయుతంగా ఎలా ప్రవర్తించాలో దాయాదికి మేము నేర్పిస్తాము’ అని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌తో వ్యవహరించే విషయంలో భారత ప్రభుత్వం కొత్త విధానాలను అనుసరిస్తున్నట్లు తెలిపారు.
Read Also : http://Delhi Blast: కారు బాంబు పేలుడు కేసు విచారణలో సంచలన విషయాలు

భారత ప్రభుత్వం ఎప్పుడూ దేశ ప్రజల శ్రేయస్సు, పురోగతిపై దృష్టి పెడుతుందని జనరల్ ద్వివేది తెలిపారు. తన మార్గంలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే.. దీటుగా స్పందిస్తుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు మద్దతిచ్చే దేశాలతో చర్చలు ఉండవని తేల్చి చెప్పారు. ఉగ్రవాద గ్రూపులకు మద్దతిస్తూ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని దాయాది పాక్‌కు జనరల్ ఉపేంద్ర ద్వివేది గట్టిగా హెచ్చరించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: