పహల్గాంలో ఉగ్రవాదుల దాడితో భారత ప్రభుత్వం పాకిస్తాన్ అందించే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. దీంతో పాకిస్తాన్ భారత్ పై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నది. తాజాగా గురువారం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్(Shahbaz) భారత్ పై పలు ఆరోపణలు చేశారు. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిందని, అదొక యుద్ధ చర్యని అభివర్ణించారు. ఈ విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, సింధూ జలాలపై పాక్ ప్రజలకు విడదీయరాని హక్కు ఉందని, దాన్ని కాపాడుకుంటామంటూ షెహబాజ్ వ్యాఖ్యానించారు.
Read Also: Trump: మైక్రోసాఫ్ట్ అధికారిణి లీసా మొనాకోను వేటు వెయ్యాల్లన్న ట్రంప్

పీఎం వ్యాఖ్యలను తిప్పికొట్టిన భారత్
పాక్ ప్రధాని మాటలను అదే ఐక్యరాజ్యసమితో భారత్ దౌత్యవేత్త పేటల్ గెహ్లాట్ గట్టిగా తిప్పికొట్టారు. షెహబాజ్ మాటలన్ని నాటకీయంగా ఉన్నాయని, విదేశాంగ విధానంలో ఉగ్రవాదాన్ని పొగిడినప్పుడే ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. పహల్గాం దాడి తర్వాత జరిగిన యుద్ధాన్ని పాకిస్తానే ఆపాలని కోరింది. పాక్ సైన్యం భారత్ ను వేడుకుంది. ఆ విషయం ప్రధాని షెహబాజ్ మర్చిపోయి మాట్లాడుతున్నారని పేటల్ అన్నారు. ఇండియాలో అమాయక పౌరులపై జరిగిన దాడికి పాక్ బాధ్యత వహించాలని ఆమె డిమాండ్(demand) చేశారు. భారత్, పాక్ దేశాల మధ్య ఉన్న సమస్యలను తమ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయని.. ఇందులో ఇతర దేశాల జోక్యం అవసరం లేదని పేటల్ స్పష్టం చేశారు.
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ ఏమని ఆరోపించారు?
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్, భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం యుద్ధ చర్యతో సమానం అని ఆరోపించారు.
భారత్ తరఫున ఎవరు స్పందించారు?
ఐక్యరాజ్యసమితిలో భారత్ దౌత్యవేత్త పేటల్ గెహ్లాట్, పాకిస్తాన్ ప్రధాని ఆరోపణలను ఖండించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: