రష్యా-ఉక్రెయిన్ లమధ్య నాలుగేళ్లుగా యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు ప్రపంచదేశాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రంప్(Trump) కూడా స్వయంగా ఇందులో జోక్యం చేసుకుని, ఏవిధంగానైనా యుద్ధాన్ని ఆపేందుకు యత్నిస్తున్నారు. (Ukraine) ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆదివారం ఫ్లోరిడాలో సమావేశం కాబోతున్నారు. రష్యాతో శాంతి ఒప్పందంపై ఇరువురి చర్చించనున్నారు. ఇలాంటి సమయంలో శనివారం తెల్లవారుజామున ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయి. దీంతో ఉక్రెయిన్ వైమానిక దళం దేశ వ్యాప్తంగా వైమానిక హెచ్చరికను ప్రకటించింది. నాలుగేళ్ల నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధం సాగుతోంది. అయితే తాజాగా 20 పాయింట్ల ప్రణాళికతో జలెన్ స్కీ ఆదివారం ట్రంప్ ను కలవనున్నారు. ఉక్రెయిన్ భద్రతపై ప్రధానంగా చర్చించేందుకు సిద్ధపడుతున్నారు. ఇలాంటి తరుణంలో కీవ్లో శక్తివంతమైన బాంబు పేలుళ్లు జరగడం మళ్లీ ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది.
Read Also: Condemns attacks on Hindus : హిందువులపై దాడులను ఖండించిన భారత్

నాలుగేళ్ల నుంచి కొనసాగుతున్న యుద్ధం
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని యుద్ధాలు సద్దుమణిగాయి. కానీ ఉక్రెయిన్-రష్యా యుద్ధం మాత్రం నాలుగేళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. తొలుత సౌదీ అరేబియా వేదికగా రష్యాతో అమెరికా చర్చలు జరిపింది. (Ukraine) కానీ ఎలాంటి పురోగతి లభించలేదు. దీంతో ట్రంపే స్వయంగా రంగంలోకి దిగి అలాస్కా వేదికగా పుతిన్ తో చర్చలు జరిపారు. అటు తర్వాత వైట్ హౌస్ లో జెలెన్ స్కీ, యూరోపియన్ దేశాధినేతలతో నరటంప్ చర్చలు జరిపారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో 28 పాయింట్ల ప్రణాళికను ట్రంప్ తీసుకొచ్చారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్ కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ స్వయంగా రంగంలోకి దిగి జెలెన్ స్కీ, పుతిన్ తో 28 పాయింట్ల ప్రణాళికపై చర్చించారు. పుతిన్ సానుకూల సంకేతం వ్యక్తపరచగా జెలెన్ స్కీ తిరస్కరించారు. దీంతో శాంతి ఒప్పందం మొదటికొచ్చింది. క్రిస్మన్ సమయానికి మంచి శుభవార్త ప్రకటిస్తానతరని ఆశిస్తే అదీ జరగలేదు. ఆదివారం ఫ్లోరిడాలో ట్రంప్ ను కలవబోతున్నట్లు ఎక్స్ లో జెలెన్ స్కీ ప్రకటించారు. ముఖ్యంగా 20 పాయింట్ల ప్రణాళికపై చర్చించబోతున్నట్లు వెల్లడించారు. ఉక్రెయిన్ కు కల్పించాల్సిన భద్రతపై చర్చించబోతున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ ట్రంప్ నుంచి ఉక్రెయిన్ కు భద్రతాహామీలు లభిస్తే గనుక రెండు దేశాలమధ్య శాంతి విరజిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. యుద్ధం వల్ల రెండు దేశాలకు మాత్రమే కాకుండా ప్రపంచదేశాలపై ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఎంతో తీవ్ర నష్టం వాటిల్లుతూనే ఉంది. అందుకే ఈ యుద్ధం ఆగిపోవాలని ప్రపంచదేశాల కోరిక.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: