యూఏఈ (UAE) ప్రభుత్వం గోల్డెన్ వీసా(Golden Visa )ను పొందడం భారతీయులకు సులభమైంది. గతంలో ఈ వీసా కోసం సుమారు రూ.4.66 కోట్ల పెట్టుబడి అవసరం కాగా, ప్రస్తుతం కేవలం రూ.23 లక్షలు చెల్లిస్తే జీవితకాల వీసా పొందవచ్చు. ఇది విదేశాల్లో స్థిరపడదలిచిన వారికి ముఖ్యమైన అవకాశం. గోల్డెన్ వీసా ఉన్నవారు అక్కడ వ్యాపారం చేయవచ్చు, ఉద్యోగం చేయవచ్చు, తాము కోరిన రంగంలో కార్యకలాపాలు సాగించవచ్చు.
కుటుంబానికి కూడ ఇస్తున్న ప్రయోజనం
ఈ వీసాతో వ్యక్తులు తమ కుటుంబ సభ్యులను కూడా UAEకి తీసుకెళ్లే అవకాశముంది. దీనివల్ల కుటుంబ సమేతంగా అక్కడ జీవించడమన్నది సులభమవుతోంది. మెరుగైన విద్య, ఆరోగ్య సౌకర్యాలు, భద్రత వంటి అంశాల దృష్ట్యా ఈ వీసా చాలా మందిని ఆకర్షిస్తోంది. పిల్లల భవిష్యత్‌కు మంచి పునాదిగా ఇది మారుతుందని భావిస్తున్నారు.
భారతీయుల వలసలకు ఊతమవుతుందా?
UAEలో తక్కువ పన్నులు, ఆధునిక మౌలిక వసతులు, అంతర్జాతీయ నాణ్యత కలిగిన జీవన విధానం భారతీయులను ఆకర్షిస్తున్నాయి. దీంతో గోల్డెన్ వీసా కారణంగా భవిష్యత్తులో భారతీయుల వలసలు మరింతగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. వలస వెళ్లే వారికే కాదు, పెట్టుబడిదారులకు కూడా ఇది లాభదాయకంగా మారుతుందని, విదేశాల్లో స్థిరపడాలనుకునే మధ్య తరగతి భారతీయులకు ఇది గొప్ప అవకాశమని అభిప్రాయపడుతున్నారు.
Read Also : PM Modi : బ్రెజిలియా చేరుకున్న ప్రధాని మోదీ