हिन्दी | Epaper

Pakistan: పాకిస్థాన్‌కు టర్కీ మద్దతు – భారత్‌ కు వెన్నుపోటు

Shobha Rani
Pakistan: పాకిస్థాన్‌కు టర్కీ మద్దతు – భారత్‌ కు వెన్నుపోటు

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ (Pakistan) పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. అయితే భారత్ నుంచి దాడులను ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ కు టర్కీ (Turkey) సాయం చేసింది. దీంతో టర్కీపై మనదేశ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. టర్కీ (Turkey) పై భారత్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా టర్కీ (Turkey) తో వాణిజ్య కార్యకలాపాలు నిలిపివేయాలని భావించినట్లు తెలుస్తోంది. మరోవైపు టర్కీ (Turkey) కి పర్యాటక ప్రాంతంగా గుర్తింపు ఉంది. ఏటా భారత్ నుంచి వేల మంది పర్యాటకులు టర్కీ (Turkey) అందాలను వీక్షించేందుకు ఆ దేశం వెళ్తుంటారు.

Pakistan: పాకిస్థాన్‌కు టర్కీ మద్దతు – భారత్‌ కు వెన్నుపోటు
Pakistan: పాకిస్థాన్‌కు టర్కీ మద్దతు – భారత్‌ కు వెన్నుపోటు

వాణిజ్య కార్యకలాపాలపై ఆంక్షలు?
అయితే తాజాగా పాకిస్థాన్ కు మద్దతుగా నిలిచిన టర్కీ (Turkey) పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో మన ట్రావెల్‌ ఏజెన్సీలు టర్కీ ఆన్‌లైన్‌ బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో టర్కీ (Turkey) పర్యాటకరంగంపై తీవ్ర ప్రభావం పడనుంది. అంతేకాక అనేక రంగాల నుంచి టర్కీకి భారత్ నుంచి ఉచ్చు బిగుస్తోంది. దిల్లీలోని ప్రఖ్యాత జేఎన్‌యూ తాజాగా కీలక ప్రకటన చేసింది. టర్కీ (Turkey) లోన ఇనొను యూనివర్సిటీతో కుదుర్చుకున్న ఒప్పందం (ఎంవోయూ) ను నిలిపేస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. దేశ భద్రత దృష్ట్యా ఇటీవల టర్కీలోని ఇనొను యూనివర్సిటీతో కుదుర్చుకున్న ఎంవోయూను ప్రస్తుతం నిలిపేస్తున్నట్లు జేఎన్‌యూ సీనియర్‌ అధికారి స్పష్టం చేశారు.
టర్కీ స్పందనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం
మరోవైపు పాకిస్థాన్ (Pakistan) కు సపోర్ట్ చేసిన టర్కీకు బుద్ధి చెప్పాలని దేశవ్యాప్తంగా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాయికాట్ టర్కీ (Turkey) నినాదం ఎక్స్ లో ఊపందుకుంది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం కొనసాగుతోంది. మరోవైపు ఆపరేషన్ సిందూర్ పై పాకిస్థాన్ (Pakistan) చేస్తున్న దుష్ప్రచారానికి టర్కీ (Turkey) , చైనా మద్దుతిస్తున్నాయి. దీంంతో ఈ రెండు దేశాలకు బుద్ధి చెప్పాలని భారత్ భావించింది. అందులో భాగంగానే.. చైనా, టర్కీకి చెందిన కొన్ని ‘ఎక్స్’ అకౌంట్లను భారత ప్రభుత్వం బ్లాక్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. టర్కీ భారత్ చేసిన సాయాన్ని మరచిపోయి ప్రవర్తించింది. 2023లో టర్కీలో భారీ భూకంపం సంభవించింది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఆ సమయంలో అన్ని ప్రపంచ దేశాల కంటే ముందు టర్కీకి సాయం చేసిన దేశం భారత్. కానీ టర్కీ మాత్రం పాకిస్థాన్ కు సపోర్ట్ చేసింది.

Read Also: TRF: టీఆర్‌ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలన్న భారత్ డిమాండ్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు

ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు

నాటో దేశాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.

నాటో దేశాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.

ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ అధ్యక్షుడి విమానం ధ్వంసం

ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ అధ్యక్షుడి విమానం ధ్వంసం

ప్ర‌ధాని మోదీ వెళ్లిపోగానే..ఇరాన్‌పై దాడి

ప్ర‌ధాని మోదీ వెళ్లిపోగానే..ఇరాన్‌పై దాడి

భారత్‌కు హార్డ్ రాక్ గుడ్ బై!

భారత్‌కు హార్డ్ రాక్ గుడ్ బై!

రంగంలోకి దిగిన ఘోరమైన B-1B లాన్సర్ విమానాలు

రంగంలోకి దిగిన ఘోరమైన B-1B లాన్సర్ విమానాలు

పారిస్‌లో అమెరికా-చైనా వాణిజ్య చర్చలు: ట్రంప్-జి సమ్మిట్‌కు రంగం సిద్ధం!

పారిస్‌లో అమెరికా-చైనా వాణిజ్య చర్చలు: ట్రంప్-జి సమ్మిట్‌కు రంగం సిద్ధం!

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. రాకపోకలు నిలిపివేత

దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. రాకపోకలు నిలిపివేత

ఎన్నిరోజులైనా పొరాడేందుకైనా మేం సిద్ధం

ఎన్నిరోజులైనా పొరాడేందుకైనా మేం సిద్ధం

తన మరణవార్తలపై నెతన్యాహు సెటైర్లు.. కొత్త వీడియోతో పుకార్లకు చెక్!

తన మరణవార్తలపై నెతన్యాహు సెటైర్లు.. కొత్త వీడియోతో పుకార్లకు చెక్!

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

📢 For Advertisement Booking: 98481 12870