हिन्दी | Epaper

ట్రంప్ డిపోర్ట్ నిర్ణయం: భారతీయులపై ఎంత ప్రభావం?

Anusha
ట్రంప్ డిపోర్ట్ నిర్ణయం: భారతీయులపై ఎంత ప్రభావం?

అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. మొన్నటి వరకు అమెరికాలో వివిధ రంగాల్లో తమ సత్తా చాటిన భారతీయులు ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ సర్కారు తీసుకుంటున్న చర్యలకు బిక్కుబిక్కుమంటున్నారు. అయితే అమెరికాలో స్థిరపడి పౌరసత్వం పొందిన భారతీయ మూలాలు ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేదని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఎవరైతే అక్రమంగా వీసా గడువు తీరిపోయినప్పటికీ ఉన్నారో వారికి మాత్రం వేటు తప్పదని ట్రంప్ సర్కార్ చెబుతోంది.

donald trump americafest phoenix

ఇప్పటికే సరైన పత్రాలు లేని కారణంగా దాదాపు 205 మంది భారతీయులను అమెరికా నుంచి డిపోర్ట్ చేసి యుద్ధ విమానం సీ-17లో భారతదేశం చేర్చనున్నారు. అయితే ఇది మొదటి బ్యాచ్ లో అని గుర్తించాలి. భారతీయులతో పాటు ఇతర విదేశీయుల్ని కూడా ఇదే తరహాలో యుద్ధ విమానాల్లోనే ఆయా దేశాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అమెరికా భారీ ఎత్తున డబ్బు వెచ్చించేందుకు కూడా వెనకాడటం లేదు. నిజానికి యుద్ధ విమానం c17 బదులు చార్టెడ్ ఫ్లైట్లో అక్రమ వలసదారులను ఆయా స్వదేశాలకు చేర్చిన అంత ఖర్చు కాదని ఇటీవల కొన్ని వార్తా సంస్థల కథనాల్లో తేలింది. అయినప్పటికీ ట్రంప్ సర్కారు విదేశీయులను తమ దేశం నుంచి డిపోర్ట్ చేసేందుకు ఏ మాత్రం వెనుకాడకుండా ముందుకు వెళుతుంది. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. మొన్నటి వరకు అమెరికాలో వివిధ రంగాల్లో తమ సత్తా చాటిన భారతీయులు ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ సర్కారు తీసుకుంటున్న చర్యలకు బిక్కుబిక్కుమంటున్నారు. అయితే అమెరికాలో స్థిరపడి పౌరసత్వం పొందిన భారతీయ మూలాలు ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేదని స్థానికులు చెబుతున్నారు. కానీ గడచిన కొన్ని దశాబ్దాలుగా అమెరికాలో స్థిరపడేందుకు వివిధ రకాల వీసాలను పొందుతూ పౌరసత్వం కోసం అనేక మార్గాలను అనుసరిస్తున్న వారికి మాత్రం డోనాల్డ్ ట్రంప్ రాక ఒక రకంగా చెప్పాలంటే చెక్ అని చెప్పవచ్చు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్ర‌ధాని మోదీ వెళ్లిపోగానే..ఇరాన్‌పై దాడి

ప్ర‌ధాని మోదీ వెళ్లిపోగానే..ఇరాన్‌పై దాడి

భారత్‌కు హార్డ్ రాక్ గుడ్ బై!

భారత్‌కు హార్డ్ రాక్ గుడ్ బై!

రంగంలోకి దిగిన ఘోరమైన B-1B లాన్సర్ విమానాలు

రంగంలోకి దిగిన ఘోరమైన B-1B లాన్సర్ విమానాలు

పారిస్‌లో అమెరికా-చైనా వాణిజ్య చర్చలు: ట్రంప్-జి సమ్మిట్‌కు రంగం సిద్ధం!

పారిస్‌లో అమెరికా-చైనా వాణిజ్య చర్చలు: ట్రంప్-జి సమ్మిట్‌కు రంగం సిద్ధం!

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. రాకపోకలు నిలిపివేత

దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. రాకపోకలు నిలిపివేత

ఎన్నిరోజులైనా పొరాడేందుకైనా మేం సిద్ధం

ఎన్నిరోజులైనా పొరాడేందుకైనా మేం సిద్ధం

తన మరణవార్తలపై నెతన్యాహు సెటైర్లు.. కొత్త వీడియోతో పుకార్లకు చెక్!

తన మరణవార్తలపై నెతన్యాహు సెటైర్లు.. కొత్త వీడియోతో పుకార్లకు చెక్!

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

ముంద్రా పోర్టుకు చేరుతున్న శివాలిక్ నౌక!

ముంద్రా పోర్టుకు చేరుతున్న శివాలిక్ నౌక!

📢 For Advertisement Booking: 98481 12870