అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పశ్చిమాసియా పర్యటనలో భాగంగా నేడు సౌదీ అరేబియాకు చేరుకొన్నారు. ఆయనకు యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ స్వాగతం పలికారు. ట్రంప్ (Donald trump) రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత చేపట్టిన తొలి పెద్ద పర్యటన ఇదే. దీనిలో భాగంగా ఆయన సౌదీ, యూఏఈ, ఖతార్‌ను సందర్శించనున్నారు. నేటి ఉదయం ఆయన విమానం రియాద్‌కు చేరుకొంది. ట్రంప్ (Donald trump) వెంట అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్, ఇంధనశాఖ మంత్రి క్రిస్ రైట్ ఉన్నారు. పశ్చిమాసియా పర్యటన నాలుగు రోజుల పాటు జరగనుంది. నేడు ట్రంప్ కోసం ఏర్పాటు చేసిన విందులో పలు కంపెనీల సీఈవోలు పాల్గొననున్నారు. వీటిల్లో అమెజాన్, ఎన్విడియా,ఓపెన్ ఏఐ,ఉబర్,కోకాకోలా,గూగుల్,బోయింగ్ సీఈవోలు ఉంటన్నారు. దీనికి టెస్లా సారథి మస్క్ కూడా హాజరుకానున్నారు. తాను తుర్కియేకు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఈ నెల 15 నుంచి ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పుతిన్, జెలెన్‌స్కీతో నేరుగా చర్చించే అవకాశాలున్నాయి.

ఖతార్ విమానం బహుమతి వివాదం
తనకు ఖతార్ రాజకుటుంబం అత్యంత విలువైన బోయింగ్ 737 విమానం గిఫ్ట్‌గా ఇవ్వనుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నారు. మరోవైపు ఆ బహుమతి తీసుకోవడం అనైతికం.. అన్న అంశాన్ని ఆయన కొట్టిపారేశారు. దాదాపు 400 మిలియన్ డాలర్ల విలువైన విలాసవంతమైన విమానాన్ని కానుకగా అందించనున్నట్లు ప్రచారం మొదలైంది. దీనిని ఎయిర్ ఫోర్స్‌వన్ కింద వాడుకోవాలని ట్రంప్ ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షులకు అందిన అత్యంత విలువైన బహుమతి ఇదే కావొచ్చు. దీనిని స్వీకరించడంపై వచ్చిన విమర్శలను తోసిపుచ్చారు. ‘‘అంత ఉదారంగా ఖతర్ రాజకుటుంబం ఇచ్చే బహుమతిని వద్దనడానికి నేను మూర్ఖుడిని కాదు’’ అని పశ్చిమాసియా పర్యటనకు వెళ్లే ముందు వ్యాఖ్యానించారు. చివర్లో దీనిని ప్రెసిడెన్షియల్ లైబ్రరీకి ఇచ్చేస్తానన్నారు. వ్యక్తిగత అవసరాలకు వాడుకొనే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు.
ట్రంప్ వ్యాఖ్యలు – ఖతార్ ప్రతినిధుల ఖండన
మరోవైపు ఖతార్ ప్రతినిధి మాత్రం తాము విమానం ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం సరికాదన్నారు. తాత్కాలికంగా ఓ విమానాన్ని బదిలీ చేసే అంశం మాత్రమే చర్చల్లో ఉందని వెల్లడించారు. ట్రంప్ ప్రకారం, ఖతార్ రాజ కుటుంబం తనకు విలువైన బోయింగ్ 737 విమానంను కానుకగా ఇవ్వనుందని చెప్పారు. దీని విలువ సుమారు 400 మిలియన్ డాలర్లు. “అలాంటి ఉదార బహుమతిని తిరస్కరించడం మూర్ఖత్వం అవుతుంది,”ట్రంప్ వ్యాఖ్య. అయితే ట్రంప్ విమానాన్ని ఎయిర్ ఫోర్స్ వన్ వంటి అధికారిక ప్రయాణాలకు మాత్రమే వాడతానని, ప్రెసిడెన్షియల్ లైబ్రరీకి భవిష్యత్తులో దానం చేస్తానని తెలిపారు. ఖతార్ ప్రతినిధులు మాత్రం ఈ విషయాన్ని ఖండించారు: “ఇది గిఫ్ట్ కాదు. తాత్కాలికంగా విమానాన్ని అందించడం మాత్రమే చర్చలో ఉంది.”
Read Also: Tamil nadu: పొల్లాచి వేధింపుల కేసులో 9 మంది దోషులు: కోర్టు