తైవాన్‌పై దాడి చేస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చైనాకు తెలుసన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump). ముఖ్యంగా చైనా(China) అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఈ విషయం బాగా అర్థం అవుతుందని చెప్పారు. జిన్‌పింగ్‌తో భేటీ జరిగిన వేళ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తైవాన్‌పై దాడి చేస్తే తీసుకునే వ్యూహాత్మక ప్రణాళికను వెల్లడించేందుకు ట్రంప్ నిరాకరించారు. దాడి చేస్తే ఏం జరుగుతుందో చైనాకు బాగా అర్థం అవుతుందని తెలిపారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా అధికారులు తైవాన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడం మానుకున్నారని డొనాల్డ్ ట్రంప్ వివరించారు.
Read Also: Rob Jetten: తొలి గే ప్రధానిగా చరిత్ర సృష్టించనున్న రాబ్ జెట్టెన్?

నేను ఎలాంటి రహస్యాలు వెల్లడించట్లేదు: ట్రంప్
“ఒక వేళ తైవాన్‌పై దాడి చేస్తే ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది. దీనికి సమాధానం ఆయనకు అర్థమవుతుంది. ఇది భేటీలో ఎప్పుడూ ఒక అంశంగా రాలేదు. ఆయన ఎప్పుడూ దాని గురించి ప్రస్తావించలేదు. ఆయన దానిని ఎప్పుడూ ప్రస్తావించలేదని ప్రజలు కొంచెం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన దానిని బాగా అర్థం చేసుకున్నారు. నేను ఎలాంటి రహస్యాలు వెల్లడించట్లేదు. ఏదైనా జరిగితే ఏమి జరుగుతుందో మీకు కచ్చితంగా చెప్పే వారిలో నేను ఒకరిగా ఉండాలని అనుకోవట్లేదు.
ట్రంప్, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు
అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం నెలకొన్న వేళ ఇరు దేశాల అధ్యక్షులు కలిశారు. దాదాపు ఆరేళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భేటీ అయ్యారు. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఆసియా- పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో భాగంగా ఇరు దేశాధినేతలు సమావేశమయ్యారు. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించాలనే లక్ష్యంతో ట్రంప్, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సమవేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
జిప్‌పింగ్‌తో కలిసి పనిచేస్తా: ట్రంప్
ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు జిప్‌పింగ్‌తో కలిసి పనిచేస్తానని ట్రంప్ చెప్పారు. జిన్‌పింగ్‌తో సమావేశం అద్భుతంగా జరిగిందన్న ట్రంప్ కొన్ని అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ట్రంప్‌ను కలిసినందుకు ఆనందంగా ఉందని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ అన్నారు. ట్రంప్ మార్గదర్శకత్వంలో ఇరుదేశాల సంబంధాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. రెండు ప్రముఖ ఆర్థిక వ్యవస్థల మధ్య అప్పుడప్పుడు ఘర్షణలు తలెత్తడం అనేది సాధారణ విషయమేనన్నారు. అయితే, ఇరుదేశాల సంబంధాలు సరైన మార్గంలో ఉండాలని జిన్‌పింగ్ సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: