हिन्दी | Epaper

Trump-Musk: మస్క్‌ను గట్టిగా హెచ్చరించిన ట్రంప్‌

Vanipushpa
Trump-Musk: మస్క్‌ను గట్టిగా హెచ్చరించిన ట్రంప్‌

ఒకప్పటి స్నేహితులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌(America President Trump), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌(Elon Musk) మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. మరోసారి ఒకరిపై ఒకరు బహిరంగంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకోవడంతో భేదాభిప్రాయలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌(Big Beautiful Bill)ను ఎలాన్‌ మస్క్‌(Elon Musk) విమర్శించడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఘాటుగా హెచ్చరించాడు. దుకాణం సర్దేసుకుని దక్షిణాఫ్రికా వెళ్లిపోతావ్ జాగ్రత్త అంటూ తీవ్రంగా స్పందించాడు. కాగా దీనిపై స్పందించిన ఎలాన్ మస్క్‌ ‘దీన్ని మరింత పెద్దది చేయాలని ఉత్సాహంగా ఉంది. చాలా చాలా ఉత్సాహంగా ఉంది. కానీ, ప్రస్తుతం ఏమీ చేయదల్చుకోలేదు’ అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టిన మస్క్‌ వెనక్కి తగ్గాడు.

Trump-Musk: మస్క్‌ను గట్టిగా హెచ్చరించిన ట్రంప్‌
Trump-Musk: మస్క్‌ను గట్టిగా హెచ్చరించిన ట్రంప్‌

చరిత్రలోనే ఎవరూ పొందలేనంతగా సబ్సిడీలు మస్క్‌ పొందారు
కాగా మస్క్‌ను ఉద్దేశించి ట్రంప్‌ ‘చరిత్రలోనే ఎవరూ పొందలేనంతగా మస్క్‌ సబ్సిడీలు పొందుతున్నారు. ఈ సబ్సిడీలే లేకుంటే రాకెట్‌ ప్రయోగాలు ఉండవు, శాటిలైట్లు ఉండవు, ఎలక్ట్రిక్‌ కార్ల ఉత్పత్తి ఉండదు. ఎలాన్‌ మస్క్‌ తన దుకాణం మూసుకుని సొంత ప్రాంతం దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లిపోవాల్సిందే. అమెరికాకు ఎంతో సంపద మిగులుతుంది’’ అని ట్రంప్‌ తన సొంత సోషల్‌ మీడియా ‘ట్రూత్‌’లో పోస్టు పెట్టడం సంచలనం సృష్టించింది. అదే సమయంలో ప్రభుత్వ ఖర్చులను నియంత్రించే ‘డోగె’ విభాగం ఎలాన్‌ మస్క్‌కు అందుతున్న సబ్సిడీల వ్యవహారంపై దృష్టిసారించాలని కోరారు. దీంతో స్పందించిన మీడియా ‘ట్రంప్‌ను దేశం నుంచి వెళ్లగొట్టే ఆలోచన ఏదైనా ఉందా?’ అంటూ ప్రశ్నించింది. అయితే ‘ఇప్పటికైతే తెలియదు.కానీ ఈ అంశంపై మేం దృష్టిపెట్టాల్సి ఉంది’ అని ట్రంప్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు.
‘బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్లు’ను వ్యతిరేకిస్తున్న మస్క్
ట్రంప్‌ తీసుకొచ్చిన ‘బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్లు’ను ఎలాన్‌ మస్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికా ప్రభుత్వ ఖర్చులను, సబ్సిడీలను తగ్గించేందుకుఈ బిల్లు ఉద్దేశించింది. అయితే దీనిపై తీవ్రంగా స్పందించిన ఎలాన్ మస్క్‌ బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్లును సమర్థించే ప్రజా ప్రతినిధుల పదవులు ఊడగొడతానని మస్క్‌ హెచ్చరించాడు. దీంతో ట్రంప్‌ సీరియస్‌ అయ్యాడు. ఎలాన్‌ మస్క్‌ కంపెనీలు టెస్లా, స్పేస్‌ ఎక్స్‌లకు అందే సబ్సిడీల అంశాన్ని ట్రంప్‌ లేవనెత్తారు. ఈ విషయమై స్పందించిన ఎలాన్‌మస్క్‌‘‘నేను సూటిగా చెబుతున్నాను. వెంటనే సబ్సిడీలన్నింటికీ కోత పెట్టేసుకోండి’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు.

Read Also: One Big Beautiful Bill Act ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్’.. ఏం జరుగుతుంది?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

క్రూడ్ ఆయిల్ సంక్షోభంతో స్కూళ్లు, కాలేజీలు బంద్

క్రూడ్ ఆయిల్ సంక్షోభంతో స్కూళ్లు, కాలేజీలు బంద్

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం.. దద్దరిల్లిన ఇజ్రాయెల్

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం.. దద్దరిల్లిన ఇజ్రాయెల్

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

అమెరికాపై ఇరాన్ హ్యాకర్ల సైబర్ దాడులు

అమెరికాపై ఇరాన్ హ్యాకర్ల సైబర్ దాడులు

సరైన సమయంలో ఇరాన్​తో యుద్ధాన్ని ముగిస్తాం-ట్రంప్

సరైన సమయంలో ఇరాన్​తో యుద్ధాన్ని ముగిస్తాం-ట్రంప్

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

గల్ఫ్ దేశాల్లో తాగునీటి ప్లాంట్లుపై దాడికి యత్నం

గల్ఫ్ దేశాల్లో తాగునీటి ప్లాంట్లుపై దాడికి యత్నం

📢 For Advertisement Booking: 98481 12870