భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయానికి స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ టారిఫ్‌లు(Trump Tariffs) చట్టబద్ధం కావని, భారత్‌తో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలకు హానికరమని పేర్కొంటూ అమెరికా ప్రతినిధుల సభలో సభ్యులు కీలక తీర్మానం ప్రవేశపెట్టారు.

ప్రతినిధుల సభ సభ్యులు డెబోరా రాస్(Deborah Ross), మార్క్ విసీ, రాజా కృష్ణమూర్తి కలిసి భారత్‌పై విధించిన 50% టారిఫ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సుంకాలు చట్టవిరుద్ధమని, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని వారు విమర్శించారు.
భారత్–అమెరికా సంబంధాలకు నష్టం
ఈ టారిఫ్‌ల(Trump Tariffs) వల్ల భారత్–అమెరికా మధ్య ఉన్న వ్యూహాత్మక, వాణిజ్య సంబంధాలకు తీవ్ర దెబ్బ తగులుతుందని అమెరికా చట్టసభ సభ్యులు హెచ్చరించారు. ఇలాంటి నిర్ణయాలు రెండు దేశాల మధ్య పరస్పర నమ్మకాన్ని దెబ్బతీస్తాయని, దీర్ఘకాలంలో అమెరికాకే నష్టమని వారు అభిప్రాయపడ్డారు.
పుతిన్–మోదీ భేటీపై అమెరికాలో ప్రకంపనలు
ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అంశం కూడా అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలు ట్రంప్ పాలనకు అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.భారత్‌పై టారిఫ్‌లు, రష్యా–భారత్ సన్నిహితత వంటి అంశాలు కలిసి ట్రంప్‌కు రాజకీయంగా ఎదురుదెబ్బగా మారుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ట్రంప్ తన వాణిజ్య విధానాలపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :