ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాల(Nuclear Centres) పై అమెరికా(America) నిర్వహించిన వైమానిక దాడుల్లో పూర్తి నాశనం జరగలేదని డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIA) నివేదిక తెలిపినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ నివేదికలు తాజాగా లీక్ కావడంతో అమెరికా(America) అంతర్గతంగా పెద్ద చర్చను రేపాయి.
ట్రంప్ అభిప్రాయం: “అవన్నీ నకిలీ వార్తలు!”
ఈ లీక్‌లపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఇవన్నీ తప్పుడు వార్తలు అని తీవ్రంగా విమర్శించారు. “చరిత్రలో అత్యంత విజయవంతమైన సైనిక దాడిని తక్కువ చేసి చూపే కుట్ర ఇది” అంటూ ట్రంప్ ట్రూత్ సోషియల్ (Trump Truth Social)లో పోస్ట్ చేశారు. “ప్రజలు ఈ తప్పుడు కథనాలను నమ్మరు” అంటూ మీడియాపై నిప్పులు చెరిగారు.

అమెరికా దాడులclaimed విస్తృత నష్టం
బీ-2 స్పిరిట్ బాంబర్లతో 14 సూపర్ బాంబులు వేసినట్లు అమెరికా అధికారికంగా ప్రకటించింది. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, అధ్యక్షుడు ట్రంప్ కలిసి, “ఇరాన్ అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి” అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. అయితే DIA నివేదిక మాత్రం ఫోర్డో, నతాంజ్ కేంద్రాల్లో కీలక భాగాలు మిగిలి ఉన్నాయని పేర్కొంది.
సెంట్రిఫ్యూజ్‌లు మళ్లీ ప్రారంభించే అవకాశం
ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం, సెంట్రిఫ్యూజ్‌లు, యురేనియం శుద్ధి పరికరాలు పూర్తిగా ధ్వంసం కాలేదు. కొన్ని నెలల్లోనే ఇరాన్ తిరిగి అణు కార్యక్రమాన్ని ప్రారంభించగలదని పేర్కొనడంతో, ట్రంప్ అధికారంలో అసహనం చెలరేగింది.
వైట్‌హౌస్ ప్రకటన: “ఇది అధ్యక్షుడిపై కుట్ర”
లీకైన నివేదికలపై స్పందించిన వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్, “ఇవి తప్పుడు ఆరోపణలతో కూడిన నివేదికలు. ట్రంప్‌ను కించపరచేందుకు ఉద్దేశించిన రాజకీయ కుట్ర” అని అన్నారు. 30వేల పౌండ్లు బాంబులతో చేసిన దాడిలో నాశనం ఎంతగా జరిగిందో అందరికీ తెలుసని స్పష్టం చేశారు.
విమర్శలపైనా వైట్‌హౌస్ స్పందన
ఇరాన్ అణు కేంద్రాలపై దాడి సైనికంగా కాక, రాజకీయంగా తీసుకున్న నిర్ణయంగా చూస్తూ చేస్తున్న విమర్శలపై వైట్‌హౌస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. “ఈ దాడిలో పాల్గొన్న యుద్ధ పైలట్ల ధైర్యాన్ని చిన్నచూపు చూడడం బాధాకరం” అని పేర్కొంది. ఈ నివేదికలను వైట్‌హౌస్ ధ్రువీకరించినప్పటికీ అందులోని అంశాలను కొట్టిపారేసింది. ఇలాంటి ఆరోపణలతో కూడిన నివేదికలను లీక్ చేయడం అధ్యక్షుడు ట్రంప్‌ను కించపరచడమే అని పేర్కొంది. ఇరాన్ అణుకార్యక్రమాన్ని నిర్మూలించిన యుద్ధ పైలట్ల ధైర్యసాహసాలను అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నంగా తెలిపింది. 30వేల పౌండ్లు కలిగిన 14 బాంబులను కచ్చితమైన లక్ష్యాలపై వేస్తే ఎంత నష్టం జరుగుతుందో అందరికీ తెలుసని శ్వేతసౌధం పేర్కొంది. ఇరాన్ అణు కేంద్రాలన్నీ మొత్తం ధ్వంసం అయ్యాయని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
Read Also: Israel-Iran: 12 రోజుల యుద్ధానికి తెరపడింది