అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఎన్నికైన నాటి నుంచి ఏదో ఒక సంచలన ప్రకటన చేస్తూ అమెరికన్లను, ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. తాజాగా అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రకంపనలు సృష్టించేలా కొత్త పన్నుల ప్రకటనలు చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. అమెరికా కేబినెట్ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. బ్రిక్స్ దేశాల(Brics Countries)పై త్వరలో 10 శాతం అదనపు పన్ను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన బ్రిక్స్ కూటమిలో ఉన్న బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా(Brazil, Russia,India, China, South Africa) దేశాలకు షాక్ ఇచ్చింది. ఈ ప్రకటనతో పాటు మరికొన్ని ప్రకటనలను కూడా ట్రంప్ కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారు.
ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం
అమెరికాలో దిగుమతి చేసుకునే రాగిపై 50 శాతం పన్ను విధిస్తూ ఈ వారం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ట్రంప్ కేబినెట్ సమావేశంలో తెలిపారు. దీని ద్వారా అమెరికా ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం పన్నుకు అదనంగా రాగి లోహాన్ని కూడా చేర్చినట్లయింది. ఈ కొత్త 50 శాతం పన్ను విధానం ద్వారా అమెరికా ఉత్పత్తి పరిశ్రమలను కాపాడవచ్చని, రాగి లోహం ఎలక్ట్రానిక్స్, నిర్మాణం, ఇంధన రంగాలలో ముఖ్యమైన ముడిసరుకుగా ఉపయోగపడుతుం దని ఆయన అన్నారు. అంతేకాకుండా ఈ పన్ను అమెరికా దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుందని ట్రంప్ బలంగా నమ్ముతున్నారు. అయితే ఈ పన్నుల పెరుగుదల అమెరికాలో రాగిని దిగుమతి చేసుకునే సంస్థలకు ఉత్పత్తి వ్యయాన్ని పెంచుతుంది. ఈ వ్యయ పెరుగుదల చివరికి ప్రజలు కొనుగోలు చేసే వస్తువుల ధరలను పెంచుతుందనడంలో సందేహం లేదు. ఈ 50 శాతం పన్ను ప్రపంచ రాగి సరఫరా గొలుసులో ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

మందుల దిగుమతులపై 200% పన్ను
మందుల దిగుమతులపై 200% పన్ను జూన్ 8న జరిగిన కేబినెట్ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. వాణిజ్య విధానంలో మరో ముఖ్యమైన ప్రకటన చేశారు. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతి చేసుకునే మందులపై 200% వరకు కఠినమైన పన్ను విధించనున్నట్లు తెలిపారు. అయితే ఈ పన్ను వెంటనే అమల్లోకి రాదని కూడా ఆయన స్పష్టం చేశారు. మందుల కంపెనీలు తమ ఉత్పత్తి కార్యకలాపాలను అమెరికాకు మార్చుకోవడానికి 18 నెలల గడువు ఇస్తామని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”మేము ఒక సంవత్సరం లేదా ఒకటిన్నర సంవత్సరం సమయం ఇస్తాము, ఆ తర్వాత ఫార్మా దిగుమతులపై అత్యధిక పన్ను విధిస్తాము’’ అని ట్రంప్ కేబినెట్ సమావేశంలో పేర్కొన్నారు.
అమెరికా ఉత్పత్తి రంగంలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి
దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే అమెరికా మార్కెట్ ఈ పన్నుల పెరుగుదల వల్ల ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. ఉత్పత్తి రంగంలో ఉద్యోగ నష్టం ట్రంప్ పదవీకాలంలో అమెరికా ఉత్పత్తి రంగంలో ఉద్యోగ నష్టం ఒక ముఖ్యమైన సవాలుగా మారింది. ప్రపంచ పోటీ, సాంకేతిక మార్పుల కారణంగా అమెరికా ఉత్పత్తి రంగంలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితిని మార్చడానికి ట్రంప్ రాగి, ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్ దిగుమతులపై పన్నులు విధిస్తున్నారు. ఈ పన్నులు దేశీయ ఉత్పత్తిని కాపాడతాయని ఆయన నమ్ముతున్నప్పటికీ, ఈ చర్యలు ఉత్పత్తి వ్యయాన్ని పెంచి చివరికి ఉద్యోగాలపై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు రాగిపై దిగుమతి పన్ను దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించినప్పటికీ, దిగుమతులపై ఆధారపడే పరిశ్రమలపై భారం పెంచుతుంది. ఇది పరోక్షంగా ఉద్యోగ నష్టానికి దారితీయవచ్చు. 14 విదేశీ అధినేతలకు హెచ్చరిక ట్రంప్ ఇదివరకే అమెరికాలో దిగుమతి చేసుకునే అన్ని దేశాల వస్తువులపై 10% ప్రాథమిక పన్నును విధించారు .
ట్రంప్ ఎలాంటి సుంకాలను విధించారు?
ట్రంప్ ఉక్కు మరియు అల్యూమినియం సుంకాలను 50%కి పెంచారు మరియు దిగుమతి చేసుకున్న కార్లపై 25% సుంకాన్ని ప్రవేశపెట్టారు. రాగిపై 50% సుంకాన్ని కూడా ప్రకటించారు మరియు భవిష్యత్ సుంకాలకు మద్దతుగా ఔషధాలు మరియు ఇతర రంగాలపై దర్యాప్తుకు ఆదేశించారు.
సుంకాలు ద్రవ్యోల్బణానికి కారణమయ్యాయా?
ఈ సంవత్సరం ప్రారంభంలో అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుందనే ఆందోళనలు ఉన్నప్పటికీ, అమెరికా అంతటా వస్తువులు మరియు సేవల ధరలు సాపేక్షంగా స్థిరంగా ఉన్నాయి.
Read hindi news:hindi.vaartha.com