हिन्दी | Epaper

Trump: ఏలియన్ల సమాచారంపై ట్రంప్ కీలక ప్రకటన

Vanipushpa
Trump: ఏలియన్ల సమాచారంపై ట్రంప్ కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం వద్ద ఉన్న గ్రహాంతర వాసుల సమాచారాన్ని బయటపెడుతానని వ్యాఖ్యానించారు. ఏలియన్ల(alien) సమాచారం ఉన్న ఫైళ్లను గుర్తించి, వాటిని విడుదల చేయాలని ఫెడరల్ ఏజెన్సీలకు xxxxxమార్గదర్శకాలు జారీ చేశారు. ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ గ్రహాంతర వాసుల సమాచారం గురించి వెల్లడించారు. ఈ క్రమంలోనే ట్రంప్ ఫెడరల్ ఏజెన్సీకి మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Read Also: Mallu Bhatti Vikramarka: ఈనెల 26 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..

Trump: Trump's key statement on alien information
Trump: Trump’s key statement on alien information

ఏలియన్స్‌ సమాచారం గురించి అమెరికన్ ప్రజలు ఆసక్తి

కొన్ని దశాబ్దాలుగా చాలామంది అమెరికన్ ప్రజలు తమ ప్రభుత్వం వద్ద ఏలియన్స్‌ సమాచారం గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని ట్రంప్ అన్నారు. అందుకే ఈ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అయితే ఒబామా ఏలియన్స్ గురించి చేసిన ఓ రహస్య విషయాన్ని చెప్పారంటూ ట్రంప్ ఆగ్రహించారు. ఆయన అలా మాట్లాడి ఉండకూడదన్నారు. కానీ ఆ సీక్రెట్ ఏంటనేది ట్రంప్ చెప్పలేదు. ఇదిలాఉండగా ఒబామా ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఏదో ఓ గ్రహంపై ఏలియన్స్ ఉండే విషయాన్ని తాను నమ్ముతున్నానని తెలిపారు. గ్రహంతర వాసులను అమెరికా నెవాడలోని ఏరియా 51లో నిర్బంధించిందనే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870