हिन्दी | Epaper

US: గాజా శవాల దిబ్బలపై ట్రంప్ కంచుకోట..అభివృద్ధి పేరిట దగా!

Vanipushpa
US: గాజా శవాల దిబ్బలపై ట్రంప్ కంచుకోట..అభివృద్ధి పేరిట దగా!

యుద్ధంలో ఇజ్రాయిల్‌కు సపోర్ట్ చేసిన ట్రంప్ యుద్ధం ముగిశాక గాజాపై ఒక్కసారిగా ప్రేమ పొంగుకొచ్చింది. గాజాపై అమెరికా అధ్యక్షుడు ఎన్నడూ లేని సానుభూతి చూపించడం వెనుక ఓ పెద్ద స్వార్థం ఉంది. అంతేకాదు గాజా పునర్నిర్మాణంలో ట్రంప్ వేల కోట్లు సొమ్ము చేసుకునే ప్లాన్ బయటపడింది. గాజా(Gaza)లో మాస్టర్ ప్లాన్ పేరిట రియల్‌ ఎస్టేట్ దందా స్టార్ట్ చేద్ధాంమని ట్రంప్ అల్లుడిని దింపాడు. యుద్ధంలో గాజా స్ట్రిప్ పూర్తిగా విధ్వంసమైయ్యేంత వరకూ చూసి అక్కడ జనాల్ని వేరే చోటుకు తరలించి ఆ విలువైన భూములు అమెరికా తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూసింది. వేలాది గాజా ప్రజల శవాల దిబ్బలపై ట్రంప్ కాసులు కురిపించే కంచుకోట కట్టుకోవాలనుకున్నాడు. అనుకున్నట్లుగా గాజా పీస్ బోర్డు ఏర్పాటు చేసి అక్కడ అభివృద్ధి పనులు ప్రారంభించారు. పునర్నిర్మాణం పేరుతో గాజాని ట్రంప్ తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. అక్కడ నిర్మాణాలు చేసేది కూడా ఆయన అల్లుడు జారెడ్ కుష్నర్.. ఇతనో బాడా రియల్ ఎస్టేట్ వ్యాపారి. యుద్ధంలో పూర్తిగా దెబ్బతిన్న గాజాని టూరిజం హబ్‌గా మార్చి డబ్బులు చేసుకుందామనే ట్రంప్ ప్లాన్ దావోస్‌లో బయటపడింది.

Read Also: Iran: పాపం బంకర్‌లో జీవిస్తున్న ఖమేనీ

US: గాజా శవాల దిబ్బలపై ట్రంప్ కంచుకోట..అభివృద్ధి పేరిట దగా!
US: గాజా శవాల దిబ్బలపై ట్రంప్ కంచుకోట..అభివృద్ధి పేరిట దగా!

గాజాని మధ్యప్రాచ్యపు ‘రివేరా’లాగా మార్చాలనేది టార్గెట్

ఇజ్రాయిల్‌తో యుద్ధంలో చిన్నాభిన్నమైన గాజాని పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు అగ్రరాజ్యం అమెరికా పునర్నిర్మాణం కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను ప్రపంచ వేదికపై ఆవిష్కరించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన ఈ ప్రణాళికను వివరించారు. కుష్నర్ రూపొందించిన ఈ ప్రణాళికలో గాజాని మధ్యప్రాచ్యపు ‘రివేరా’లాగా మార్చాలనేది టార్గెట్. ఈ నిర్మాణం కేవలం రెండు లేదా మూడు సంవత్సరాలలో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఆధునిక యుటిలిటీలు, ప్రజా సేవలను అభివృద్ధి చేయడానికి ఈ ప్రణాళికకు $25 బిలియన్లకు పైగా అవసరమని శాంతి బోర్డు అంచనా వేసింది.

విలాసవంతమైన పర్యాటక కేంద్రం

గాజా సముద్ర తీర ప్రాంతాన్ని విలాసవంతమైన పర్యాటక కేంద్రం గా మార్చాలని కుష్నర్ ప్రతిపాదించారు. ఇందులో అత్యాధునిక నివాస గృహాలు, ఆకర్షణీయమైన బిల్డింగులు, ‘స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ల’ను ఏర్పాటు చేయనున్నారు. ఇది కోస్టల్ టూరిజంను చూపిస్తుంది. ఇందులో 170 రెసిడెన్షియల్ టవర్లు, డేటా సెంటర్లు, ఫ్యాక్టరీలు ఉన్నాయి, వీటిని పార్కులు, వ్యవసాయం క్రీడా సౌకర్యాల ద్వారా విభజించారు. ఎత్తైన భవనాలు, హోటళ్ళు, విలాసవంతమైన విల్లాలను ఏర్పాటు చేయనున్నారు. గాజాలో కొత్త విమానాశ్రయం, పెద్ద ఓడరేవు, అధునాతన రహదారులను నిర్మించాలని ప్లాన్ చేశారు. దీని ద్వారా గాజా జీడీపీని 10 బిలియన్ డాలర్లకు పెంచవచ్చని ఆయన అంచనా వేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యుద్ధం ఎఫెక్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు బంద్

యుద్ధం ఎఫెక్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు బంద్

మాస్కోలో చికిత్స? ఖమేనీపై రూమర్స్

మాస్కోలో చికిత్స? ఖమేనీపై రూమర్స్

ట్రంప్‌కు షాక్ NCTC చీఫ్ రాజీనామా

ట్రంప్‌కు షాక్ NCTC చీఫ్ రాజీనామా

ఇంధన ఆదా కోసం బుధవారాన్ని సెలవుగా ప్రకటించిన శ్రీలంక

ఇంధన ఆదా కోసం బుధవారాన్ని సెలవుగా ప్రకటించిన శ్రీలంక

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, టాప్ కమాండర్ గొలాంరెజాలను హతమార్చిన ఇజ్రాయెల్

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, టాప్ కమాండర్ గొలాంరెజాలను హతమార్చిన ఇజ్రాయెల్

ఇరాన్ నుండి ఢిల్లీకి చేరిన 45 మంది విద్యార్థులు

ఇరాన్ నుండి ఢిల్లీకి చేరిన 45 మంది విద్యార్థులు

ఎలన్ మస్క్ VS సామ్ ఆల్ట్‌మాన్..

ఎలన్ మస్క్ VS సామ్ ఆల్ట్‌మాన్..

ఇరాన్ యుద్ధం..రాయలసీమ అరటి రైతులకు భారీ దెబ్బ

ఇరాన్ యుద్ధం..రాయలసీమ అరటి రైతులకు భారీ దెబ్బ

పాకిస్థానీలకు 2 ఏళ్లు.. మనకు 134 ఏళ్లు..

పాకిస్థానీలకు 2 ఏళ్లు.. మనకు 134 ఏళ్లు..

కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి పై తీవ్రంగా ఖండించిన భారత్

కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి పై తీవ్రంగా ఖండించిన భారత్

నాకు గర్ల్ ఫ్రెండ్ దొరికిందోచ్..!..పంచ్ ఆనంద కేరింతలు
0:32

నాకు గర్ల్ ఫ్రెండ్ దొరికిందోచ్..!..పంచ్ ఆనంద కేరింతలు

ఆఫ్ఘన్ దాడులపై ఐరాస సమావేశంలో పాకిస్థాన్‌పై భారత్ విమర్శలు

ఆఫ్ఘన్ దాడులపై ఐరాస సమావేశంలో పాకిస్థాన్‌పై భారత్ విమర్శలు

📢 For Advertisement Booking: 98481 12870