Trump controversial map : అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా షేర్ చేసిన ఒక వివాదాస్పద మ్యాప్ అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ట్రూత్ సోషల్ వేదికగా విడుదలైన ఈ ఏఐ-జనరేటెడ్ మ్యాప్‌లో కెనడా, వెనిజులా, గ్రీన్‌ల్యాండ్‌లను అమెరికా భూభాగాలుగా చూపించడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రీన్‌ల్యాండ్‌ను “US Territory – 2026”గా పేర్కొనడం మరింత కలకలం రేపింది.
డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్‌ల్యాండ్ ఖనిజ వనరులు, భౌగోళిక ప్రాధాన్యత కారణంగా అమెరికా జాతీయ భద్రతకు కీలకమని ట్రంప్ భావిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. అయితే ఈ అంశంలో యూరోపియన్ దేశాలు బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. తమ అభిప్రాయాలను పట్టించుకోని దేశాలపై ట్రంప్ వాణిజ్య సుంకాల బెదిరింపులు చేయడం ఉద్రిక్తతను పెంచుతోంది.
Read also: Gudimalkapur: తెలంగాణలో నకిలీ నోట్లు స్వాధీనం .. ముగ్గురు అరెస్టు

ఇదే సమయంలో, కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా (Trump controversial map) చూడాలన్న ట్రంప్ గత వ్యాఖ్యలు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగాయి. గ్రీన్‌ల్యాండ్ అంశంపై నాటో మిత్రదేశాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలన్నీ కలిసి ప్రపంచ రాజకీయాలు, అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: