हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

అక్రమ వలసదారులపై మోడీకి ట్రంప్ ఫోన్

Vanipushpa
అక్రమ వలసదారులపై మోడీకి ట్రంప్ ఫోన్

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే దేశంలో అక్రమ వలసలపై సీరియస్ గా ఫోకస్ పెట్టిన డొనాల్డ్ ట్రంప్ రోజురోజుకీ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చిన్న చిన్న దేశాల వలసదారుల్ని గుర్తించి అరెస్టు చేసి విమానాలు ఎక్కించి వారి స్వదేశాలకు పంపేస్తున్న ట్రంప్.. భారత్ వంటి పెద్ద దేశాల విషయంలో మాత్రం సున్నితంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదే క్రమంలో భారత ప్రధాని నరేంద్రమోడీకి కూడా ట్రంప్ ఫోన్ చేశారు.

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయ వలసదారుల్ని తాము గుర్తించామని, వారిని గౌరవంగా వెనక్కి తీసుకుంటే బావుంటుందని, లేకపోతే తామే స్వయంగా వారిని ఇతర దేశాల తరహాలో బహిష్కరిస్తామని ప్రధాని మోడీకి ట్రంప్ సున్నితంగా చెప్పేసినట్లు తెలుస్తోంది. మోడీతో ఫోన్ కాల్ అనంతరం ట్రంప్ భారతీయ వలసల తరలింపుపై ఓ ప్రకటన చేశారు. భారత్ అక్రమ వలసదారుల విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.

భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి అక్రమ వలసదారులపై చర్చించినట్లు ట్రంప్ ప్రకటించారు. అక్రమ వలసదారులను వెనక్కి తీసుకునే విషయంలో భారత్ సరైన నిర్ణయం తీసుకుంటుందని ట్రంప్‌ చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. అదే సమయంలో అమెరికా-తయారు చేసిన రక్షణ పరికరాల కొనుగోలును భారత్ పెంచాలని, అలాగే మరింత సమతుల్య వాణిజ్య సంబంధాల వైపు వెళ్లవలసిన అవసరాన్ని అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోడీకి గుర్తుచేశారని పేర్కొంది. మరోవైపు ఫిబ్రవరిలో మోదీ వైట్‌హౌస్‌కు వచ్చి తనతో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు. మోడీతో చాలాసేపు మాట్లాడానని, అతను వచ్చే నెలలో, బహుశా ఫిబ్రవరిలో వైట్ హౌస్‌కి రాబోతున్నాడని ట్రంప్ తెలిపారు. భారత్‌తో తమకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయని ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకరులతో ట్రంప్ అన్నట్లు రాయిటర్స్ వెల్లడించింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870