అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) తెలంగాణ(Telangana)కు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆయనకు చెందిన ట్రంప్ మీడియా టెక్నాలజీస్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit 2025) వేదికగా ఆ సంస్థ డైరెక్టర్ ఎరిక్ ప్రకటన చేశారు. వచ్చే పదేళ్లలో రూ.లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్త నగరాన్ని నిర్మించాలనే ఆలోచన అభినందనీయమని సీఐఐ మాజీ ఛైర్మన్ దినేశ్ అన్నారు. తెలంగాణ ఇప్పటికే వేగంగా అభివృద్ధి అవుతున్న రాష్ట్రంగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థలను ఒకే వేదిక మీదకు తీసుకురావడం అనేది గొప్ప విషయమని పేర్కొన్నారు. తెలంగాణ విజన్‌లో తాము భాగస్వాములు అయ్యేందుకు రెడీగా ఉన్నామని పేర్కొన్నారు.
Read Also: Global Summit: అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి

సిమెంట్, గ్రీన్ డేటా సెంటర్స్, రెన్యువబుల్ ఎనర్జీలో పెట్టుబడులు
అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఎండీ కరణ్ అదానీ మాట్లాడుతూ తెలంగాణ విజన్‌ను ఈ సమిట్ ప్రతిబింబిస్తోందని తెలిపారు. అదానీ గ్రూప్ ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. సిమెంట్, గ్రీన్ డేటా సెంటర్స్, రెన్యువబుల్ ఎనర్జీలో పెట్టుబడులు పెడుతున్నామని పేర్కొన్నారు. డిఫెన్స్, ఏరోస్పేస్ పార్క్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాదు దేశంలోనే తొలిసారిగా UAV టెక్నాలజీని హైదరాబాద్‌లో రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో తయారయ్యే UAVలను దేశ సైన్యానికి అందిస్తామని తెలిపారు. ప్రపంచమార్కెట్‌లో కూడా అమ్ముతామన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: