అలీ ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన ఇరానియన్లు.. తమకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ఆశాకిరణంలా కనిపించారు. కానీ, ఆయన మాటలకు, చేతలకు పొంతనలేకపోవడం వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది. మొదట్లో నిరసనకారులను ప్రోత్సహించిన ట్రంప్.. శాంతియుత ప్రదర్శనకారులకు హాని జరిగితే అమెరికా సిద్ధంగా ఉందని ఇరాన్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో తమకు గట్టి మద్దతు లభిస్తుందని, బహుశా సైనిక జోక్యం కూడా ఉంటుందని ఇరానియన్లు ఆశించారు. దీనికి అనుగుణంగా పెంటగాన్ ఒక ముఖ్యమైన అమెరికా స్థావరం నుంచి సిబ్బందిని తరలించడం వంటి వార్తలు యుద్ధ సన్నాహాలుగా భావించారు.
కానీ, ట్రంప్ అకస్మాత్తుగా తన వైఖరిని మార్చుకున్నారు. ఇరాన్ ప్రభుత్వం హింసను ఆపివేస్తుందని హామీ ఇచ్చిందని, సైనిక చర్య ఉండదని ట్రంప్ ప్రకటించారు. ప్రాణాలకు తెగించి వీధుల్లోకి వచ్చిన నిరసనకారులకు ఓ రకంగా ఇది పెద్ద షాక్. 15,000 మంది మరణాలకు ట్రంప్ బాధ్యుడని, ఎందుకంటే చాలా మంది నిరసనకారులు ఆయన ‘locked and loaded’ అనే పోస్ట్ చూసే వీధుల్లోకి వచ్చారని ఇరాన్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ఆరోపించారు. ఇస్లామిక్ రిపబ్లిక్‌తో కలిసి ఇరాన్ పౌరులను ఇలా మోసం చేయడానికి అమెరికా ఓ ఒప్పందం చేసుకుని ఉంటుందని ఆయన దుయ్యబట్టారు.
Read Also: Switzerland: జ్యూరిక్ చేరుకున్న మంత్రి లోకేశ్

మమ్మల్ని బలిపశువులుగా చేశారు
ఇకపై హత్యలు, మరణశిక్షలు ఉండవని ఇరాన్ అదికారులు తనకు హామీ ఇచ్చారన్న ట్రంప్ ప్రకటనతో అంతా నిశ్చేష్టులయ్యారని దేశం విడిచి వెళ్లిన ఒక ఇరానియన్ తెలిపారు. ‘అందరూ ఆగ్రహంతో ఉన్నారు.. వారు మమ్మల్ని బలిపశువులుగా ఉపయోగించుకున్నారని అనుకుంటున్నారు.. తమను మోసం చేశారని, ఫూల్ చేశారని ఇరాన్ పౌరులు భావిస్తున్నారు.’ అని వ్యాఖ్యానించాడు. ట్రంప్ మాటలను నమ్మి నిరసనల్లో పాల్గొన్నవారి భావోద్వేగాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ‘ట్రంప్ తప్పు చేశాడు. మా కాళ్ల కింద నుంచి నేలను లాగేసుకున్నాడు… ఆయన ఊసరవెల్లి’ అని మరో టెహ్రాన్ పౌరుడు టైమ్ మ్యాగజైన్‌కు చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: