हिन्दी | Epaper

Colombia: కెనడాలో రక్తపాతం సృష్టించిన ట్రాన్స్‌జెండర్ యువతి

Vanipushpa
Colombia: కెనడాలో రక్తపాతం సృష్టించిన ట్రాన్స్‌జెండర్ యువతి

కెనడా(Canada)లోని ఓ సెకండరీ స్కూల్లో ట్రాన్స్‌జెండర్ రక్తపాతం సృష్టించింది. బ్రిటిష్ కొలంబియా రాష్ట్రం టంబ్లర్ రిడ్జ్ పట్టణంలో ఫిబ్రవరి 10న ఘోర విషాదం చోటుచేసుకుంది. 18ఏళ్ల ట్రాన్స్‌జెండర్ యువతి జరిపిన కాల్పుల్లో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. నిందితురాలు ఫస్ట్ ఇంట్లో ఉన్న తల్లిని, తమ్ముడిని కాల్చి చంపి, తర్వాత స్థానిక పాఠశాల్లోకి వచ్చి స్టూడెంట్స్, టీచర్స్‌పై గన్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 9మంది చనిపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. 18 ఏళ్ల జెస్సీ వాన్ రూట్‌సెలార్ అనే యువతి ఈ దారుణానికి ఒడిగట్టింది. మంగళవారం మధ్యాహ్నం ఆమె నివాసంలోనే తన తల్లిని(39), తన 11 ఏళ్ల తమ్ముడిని తుపాకీతో కాల్చి చంపింది. తర్వాత నేరుగా టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్‌కు చేరుకుని అక్కడ విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది.

Read Also: India: అమెరికా ఉత్పత్తుల జాబితా నుంచి పప్పుధాన్యాల తొలగింపు

Colombia: కెనడాలో రక్తపాతం సృష్టించిన ట్రాన్స్‌జెండర్ యువతి
Colombia: కెనడాలో రక్తపాతం సృష్టించిన ట్రాన్స్‌జెండర్ యువతి

పోలీసుల నిఘాలో జెస్సీ

స్కూల్లోకి ప్రవేశించిన జెస్సీ ఒక్కసారిగా విద్యార్థులు, ఉపాధ్యాయులపై కాల్పులు మొదలుపెట్టింది. ఈ దాడిలో ఓ మహిళా ఉపాధ్యాయురాలితో పాటు ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల శబ్దంతో స్కూల్ మొత్తం దద్దరిల్లింది. సమాచారం అందుకున్న రాయల్ కెనేడియన్ మౌంటెడ్ పోలీస్ ఘటనా స్థలానికి చేరుకునేలోపే నిందితురాలు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో మరో 25 మందికి పైగా గాయపడ్డారు. పోలీసు విచారణలో జెస్సీకి సంబంధించిన కీలక విషయాలు వెల్లడయ్యాయి. జెస్సీ పుట్టుకతో పురుషుడు అయినప్పటికీ, సుమారు ఆరేళ్ల క్రితం మహిళగా మారుతూ ట్రాన్సిషన్ ప్రారంభించింది. సామాజికంగా ఆమె మహిళగానే గుర్తింపు పొందింది.

మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి

గతంలో జెస్సీ మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా పలుమార్లు పోలీసుల నిఘాలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆమె మెంటల్ హెల్త్ చెక్అప్ కోసం గతంలోనూ పోలీసులు జెస్సీ ఇంటికి వెళ్లారు. ఆమె నాలుగేళ్ల క్రితమే స్కూల్ నుంచి డ్రాపౌట్, ప్రస్తుతం ఆమె ఆ స్కూల్ విద్యార్థిని కాదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను సగం వరకు దించి బాధితులకు నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా, సంస్థలో కీలక మార్పు

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా, సంస్థలో కీలక మార్పు

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

‘ఖర్గ్‌ ఐలాండ్‌’పై ట్రంప్‌ కన్ను

‘ఖర్గ్‌ ఐలాండ్‌’పై ట్రంప్‌ కన్ను

ఇంధన పొదుపు దిశగా థాయిలాండ్, వియత్నాం అడుగులు

ఇంధన పొదుపు దిశగా థాయిలాండ్, వియత్నాం అడుగులు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

జపాన్ లో ఆరు నెలలకు సరిపడా చమురు స్టాక్

జపాన్ లో ఆరు నెలలకు సరిపడా చమురు స్టాక్

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

యుద్దం ఆపడం మా చేతుల్లో పని..ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

యుద్దం ఆపడం మా చేతుల్లో పని..ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

ఇరాన్‌లో విషాదం: చమురు డిపోలపై దాడుల తర్వాత కురుస్తున్న ‘నల్లటి ఆమ్ల వర్షం’

ఇరాన్‌లో విషాదం: చమురు డిపోలపై దాడుల తర్వాత కురుస్తున్న ‘నల్లటి ఆమ్ల వర్షం’

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

శ్రీలంకలో ఆకాశాన్నంటిన ఇంధన ధరలు

శ్రీలంకలో ఆకాశాన్నంటిన ఇంధన ధరలు

📢 For Advertisement Booking: 98481 12870