Train Accident: ఈ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అధిక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమానప్రమాదాలతో పాటు పడవ ప్రమాదాలు కూడా అధికంగానే చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది మరణించారు. మితిమీరిన వేగం, తాగిన మత్తులో, నిద్రమత్తులో, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణాలు ఏమైతేనేం ప్రమాదాలతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా మెక్సికోలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారు.
వందమందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దక్షిణ మెక్సికన్ (Mexico) రాష్ట్రమైన ఓక్సాకాలో ఆదివారం ఇంటర్ ఓషియానిక్ రైలు పట్టాలు తప్పిందని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒకటిగా పేర్కొన్నారు. రైల్లో తొమ్మిదిమంది సిబ్బంది, 241మంది ప్రయాణికులు సహా 250 మంది ఉన్నారని మెక్సికన్ నేవీ తెలిపింది. 193మంది ప్రమాదం నుంచి బయటపడినట్లు సమాచారం. తొంభై ఎనిమిదిమంది గాయపడ్డారని, 36 మంది వైద్య చికిత్స పొందుతున్నారని నేవీ తెలిపింది.
Read also: Canada Healthcare: వైద్య నిర్లక్ష్యం కారణంగా కెనడాలో భారతీయుడు మరణం

Train Accident
కొనసాగుతున్న దర్యాప్తు
పట్టాలు తప్పడానికి కారణాలు వెల్లడి కాలేదు. ప్రమాదానికి దారితీసిన కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటివరకు 13మంది చనిపోయారు. ఇక గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సహాయం చేయడానికి సీనియర్ ప్రభుత్వ అధికారులను సంఘటనా స్థలానికి పంపినట్లు అధ్యక్షురాలు క్లాడియా షీన్ భామ్ ఎక్స్ పోస్ట్ లో తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: