हिन्दी | Epaper

Earthquakes: టోకారా దీవుల్లో తీవ్ర స్థాయిలో భూ ప్ర‌కంప‌న‌లు

Vanipushpa
Earthquakes: టోకారా దీవుల్లో తీవ్ర స్థాయిలో భూ ప్ర‌కంప‌న‌లు

ద‌క్షిణ జ‌పాన్‌లో ఉన్న టోకారా దీవుల్లో తీవ్ర స్థాయిలో భూ ప్ర‌కంప‌న‌లు(Earthquakes) చోటుచేసుకుంటున్నాయి. గ‌త రెండు వారాల్లోనే ఆ దీవుల్లో సుమారు 900 సార్లు భూమి కంపించింది. దీంతో స్థానికులు రాత్రిపూట నిద్ర లేకుండా గ‌డుపుతున్నారు. జూన్ 21వ తేదీ నుంచి టోకారా దీవుల్లో సెసిమిక్ యాక్టివిటీ చాలా యాక్టివ్‌గా మారిన‌ట్లు అధికారులు చెప్పారు. బుధ‌వారం అక్క‌డ 5.5 తీవ్ర‌త‌తో భూకంపం వ‌చ్చింది. ప్ర‌స్తుతం అక్క‌డ ఎటువంటి న‌ష్టం జ‌ర‌గ‌లేదు. సునామీ వార్నింగ్ కూడా ప్ర‌భుత్వం ఇవ్వ‌లేదు. ఒక‌వేళ అవ‌స‌రం అయితే ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్ల‌వ‌చ్చు అని ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది.

Earthquakes: టోకారా దీవుల్లో తీవ్ర స్థాయిలో భూ ప్ర‌కంప‌న‌లు
Earthquakes: టోకారా దీవుల్లో తీవ్ర స్థాయిలో భూ ప్ర‌కంప‌న‌లు

భూ ప్ర‌కంప‌న‌లు ఎక్కువ కావ‌డం వ‌ల్ల నిద్ర ప‌ట్ట‌డం లేద‌ని స్థానికులు భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ప‌సిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ రేఖాంశంలో ఉన్న జ‌పాన్‌లో సాధార‌ణంగా భూకంపాలు తీవ్ర స్థాయిలో వ‌స్తుంటాయి. ఆ దేశంలో ప్ర‌తి ఏడాది 1500 భూ ప్ర‌కంప‌న‌లు వ‌స్తుంటాయి. టొకారాలో 12 దీవులు ఉన్నాయి. వాటిల్లో సుమారు 700 మంది జీవిస్తున్నారు. ఈ దీవుల్లో ఆస్ప‌త్రులు ఉండ‌వు. ఎమ‌ర్జెన్సీ అయితే స‌మీపంలో ఉన్న క‌గోషిమా దీవికి వెళ్తారు.

టోకారా దీవుల పరిస్థితి
మొత్తం 12 ద్వీపాలు, జనాభా: సుమారు 700 మంది. ఆస్పత్రులు లేవు, మౌలిక సదుపాయాలు కొరత, భూకంపం వల్ల ఆధునిక కమ్యూనికేషన్, రవాణా కూడా ప్రభావితమయ్యే అవకాశముంది. ఇప్పటివరకు తీవ్రమైన నష్టం లేదన్నా, అగ్నిపర్వత చలనం లేదా సముద్ర లోతుల్లో చీలికలు ఏర్పడితే భవిష్యత్తులో ప్రమాదాల అవకాశాలు ఉన్నాయి. పసిఫిక్ రింగ్‌లో 1500 భూకంపాలు ప్రతి ఏడాది వస్తాయని జపాన్‌కు ఇది కొత్త కాదు, కానీ ఈ స్థాయిలో వరుసగా రావడం అలార్మింగ్.

Read Hindi news: hindi.vaartha.com

Read Also: Japan: జూలై 5 సునామీ భయంతో జపాన్ వణుకు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

ఒక్క చుక్క చమురు కూడా బయటికి రాదు..ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్

ఒక్క చుక్క చమురు కూడా బయటికి రాదు..ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

తన కూతురితో కలిసి క్రూయిజ్ క్షిపణి పరీక్షలను వీక్షించిన కిమ్

తన కూతురితో కలిసి క్రూయిజ్ క్షిపణి పరీక్షలను వీక్షించిన కిమ్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆరోగ్యంపై పెరుగుతున్న ఊహాగానాలు

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆరోగ్యంపై పెరుగుతున్న ఊహాగానాలు

అమెరికాపై ఒత్తిడి..రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుకు అనుమతి

అమెరికాపై ఒత్తిడి..రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుకు అనుమతి

ఇండిగో సీఈఓ రాజీనామా

ఇండిగో సీఈఓ రాజీనామా

హర్మూజ్‌ జలసంధి సమీపంలో యూఎస్ దాడులు

హర్మూజ్‌ జలసంధి సమీపంలో యూఎస్ దాడులు

హర్మూజ్‌ మూతపడితే ఆహార ధరలు పెరుగుతాయి: సమితి హెచ్చరిక

హర్మూజ్‌ మూతపడితే ఆహార ధరలు పెరుగుతాయి: సమితి హెచ్చరిక

ముఖేష్ అంబానీతో ట్రంప్ భారీ ఒప్పందం

ముఖేష్ అంబానీతో ట్రంప్ భారీ ఒప్పందం

రిలయన్స్ తో ట్రంప్ భారీ డీల్

రిలయన్స్ తో ట్రంప్ భారీ డీల్

సమితిలో ఇరాన్ సంచలన ఆరోపణలు: ఇజ్రాయెల్ వైఖరిపై తీవ్ర నిరసన

సమితిలో ఇరాన్ సంచలన ఆరోపణలు: ఇజ్రాయెల్ వైఖరిపై తీవ్ర నిరసన

📢 For Advertisement Booking: 98481 12870