हिन्दी | Epaper

BCCI: భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ లు ఉండవు: బీసీసీఐ

Anusha
BCCI: భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ లు ఉండవు: బీసీసీఐ

పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అంతేకాక పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీనిపై భారత్ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇదో పిరికిపంద చర్యగా, హేయమైన చర్యగా అభివర్ణించాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే పాకిస్థాన్ కు చెక్ పెట్టేందుకు 5 సంచలన నిర్ణయాలు తీసుకుని పాకిస్థాన్ కు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొట్టింది.అయితే ఈ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ లు ఉండబోవని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో భారత్ పాక్ మధ్య పోరు చూడాలనే ఫ్యాన్స్ కు కొంత నిరాశ అనే చెప్పొచ్చు.

ఉగ్రదాడి

భారత్- పాకిస్థాన్ మధ్య చివరగా 2012-13లో ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అప్పటినుంచి కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఇరు దేశాలు తలపడుతూ వచ్చాయి. అయితే తాజా సంఘటనలతో ఇక భవిష్యత్తులోనూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుందని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు.భారత్- పాక్ మధ్య చివరి ద్వైపాక్షిక సిరీస్ 2012-13లో జరిగింది. అంతకంటే నాలుగేళ్ల ముందే ముంబై ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. కానీ అప్పటి యూపీఏ ప్రభుత్వం క్రికెట్ కు అడ్డుచెప్పలేదు. ఇక రెండు నెలల క్రితం జరిగిన చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చింది. కానీ, ఆ టోర్నీకి భారత్ వెళ్ల లేదు.దుబాయ్ లో మ్యాచ్ లు ఆడి అక్కడే టైటిల్ కొట్టింది.

BCCI: భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ లు ఉండవు: బీసీసీఐ

భద్రత

ఈ వ్యాఖ్యలు నేపథ్యంలో, భారత మహిళల జట్టు, పాకిస్తాన్ మహిళల జట్టు మధ్య వచ్చే ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఈ ఉదంతం ప్రభావం ఎలా ఉంటుందో, రెండు బోర్డులు దీన్ని ఎలా సమర్థంగా ఎదుర్కొంటాయో అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. దేశ భద్రతకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తూనే, క్రీడా సంబంధాల్లో కూడా కఠినమైన వైఖరిని పాటించాల్సిన అవసరం ఉందని రాజీవ్ శుక్లా వ్యాఖ్యలు బలంగా సూచిస్తున్నాయి. ఈ సంఘటనల నేపథ్యంలో పాక్‌తో క్రికెట్ సంబంధాలు కొనసాగించరాదన్న నిర్ణయం పై బీసీసీఐ స్పష్టత ఇచ్చినట్లు కనిపిస్తోంది.

Read Also: Telangana : తెలంగాణకు మరో స్వర్ణ పతకం: ఇంటర్నేషనల్ ఫెడరేషన్ కప్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం, భారతీయుల తరలింపుపై కేంద్రం స్పందన

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం, భారతీయుల తరలింపుపై కేంద్రం స్పందన

ఇరాన్‌కు రష్యా పూర్తి అండ – పుతిన్ కీలక ప్రకటన

ఇరాన్‌కు రష్యా పూర్తి అండ – పుతిన్ కీలక ప్రకటన

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

క్రూడ్ ఆయిల్ సంక్షోభంతో స్కూళ్లు, కాలేజీలు బంద్

క్రూడ్ ఆయిల్ సంక్షోభంతో స్కూళ్లు, కాలేజీలు బంద్

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం.. దద్దరిల్లిన ఇజ్రాయెల్

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం.. దద్దరిల్లిన ఇజ్రాయెల్

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

అమెరికాపై ఇరాన్ హ్యాకర్ల సైబర్ దాడులు

అమెరికాపై ఇరాన్ హ్యాకర్ల సైబర్ దాడులు

📢 For Advertisement Booking: 98481 12870